Telugu

ఒకప్పుడు చర్చ సినిమాల గురించి.. ఇప్పుడు కలెక్షన్స్ గురించి!

ఓ సినిమా బాగుంటే బోలెడు డబ్బు పెట్టి టికెట్ కొనుకొని ‘థియేటర్లో’ చూశామని ప్రేక్షకులు చాలా సంతోసహిస్తారు. లేకుంటే తిట్టుకుంటారు అంతే! ఇప్పటి సినిమాలతో ప్రేక్షకుల సంబంధం ఇంత వరకే.

ఒకప్పటి సినిమాలతో ప్రేక్షకులకు చాలా అనుబంధం ఉండేది. అవి చాలా మందికి మధుర స్మృతులుగా నిలిచిపోతాయి.

ADVERTISEMENT

ఇప్పటి సినిమాల గురించి మాట్లాడుకోవాలంటే బడ్జెట్‌ ఎంత, గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? విదేశాలలో పాటలు, ఫైట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయా లేవా? కలెక్షన్స్ ఎంత?వంటి విషయాలే ఎక్కువ మాట్లాడుకుంటున్నాము. అప్పటి, ఇప్పటి సినిమాల మద్య ఈ తేడా నానాటికీ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఎందువల్ల?

అయినా సినిమా బాగుందా లేదా? దానిలో కధ, పాటలు, సంగీతం వగైరా బాగున్నాయా లేదా? అని మాట్లాడుకునే బదులు ఏ సినిమాకి ఎంత కలెక్షన్స్ వచ్చాయి. ఫలానా సినిమా కలెక్షన్స్ రికార్డ్ ఇంత. మరి ఈ సినిమా ఆ రికార్డ్ బద్దలు కొడుతుందా లేదా?అని అభిమానులు ఆరాటపడితే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రేక్షకులు కూడా కలెక్షన్స్‌ని బట్టి సినిమా బాగుందో లేదో నిర్ణయించుకునే పరిస్థితిని కల్పిస్తుండటాన్ని ఏమనుకోవాలి?

ఓ ప్రముఖ నిర్మాత తాజా ఇంటర్వ్యూలో ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్‌ కోసం కలెక్షన్స్ పెంచి చూపించేవారిమని, కానీ వాటితో ఆదాయపన్ను శాఖ నిలదీస్తుండటంతో దాదాపు అందరూ ఆ రకం ప్రమోషన్స్ (ఫేక్ కలెక్షన్స్ రిపోర్ట్) మానుకున్నామని కుండ బద్దలు కొట్టారు.

కనుక కలెక్షన్స్ గురించి ఆలోచించుకావాల్సింది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లే తప్ప ప్రేక్షకులు కారు. కానప్పుడు ఓ సినిమాకి కలెక్షన్స్ కొలమానం కాకూడదు కదా?

కనుక ప్రేక్షకులు కలకాలం గుర్తుంచుకునేలా సినిమాలు తీయగలిగితే చాలు. వాటి గురించి వారే చెప్పుకుంటారు. అలాంటి గొప్ప సినిమాలు తీసినందుకు దర్శక నిర్మాతలకు, నటీనటులు గర్వపడవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Sneha In Kaaka? This Casting Buzz Is Interesting

A new casting buzz around Chiranjeevi’s Kaaka is getting attention. Actress Sneha is reportedly joining…

23 minutes ago

రేవంత్ రెడ్డిని కేసీఆర్‌ తక్కువ అంచనా వేశారా?

కేసీఆర్‌ ఫామ్‌హౌసులో కూర్చొని శాసనసభ సమావేశాలలో 22ఏ నిషేదిత భూముల వ్యవహారంపై అద్భుతమైన వ్యూహం రచించి సిఎం రేవంత్‌ రెడ్డిని…

23 minutes ago