
2016లో విడుదలైన సరైనోడు 72 కోట్ల షేర్ తో బన్నీకెరీర్ బెస్ట్ గా ఉంది. ఆ తరువాత విడుదలైన డీజే, నా పేరు సూర్య కూడా అంతకు మించి దాటలేదు. అయితే ఇప్పుడు బన్నీ డబల్ సెంచరీ కొడతాడని అభిమానులు ధీమాగా ఉన్నారు. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సంక్రాంతి వస్తున్న అల వైకుంఠపురములో సీజన్ ఎఫెక్ట్ తో 100 కోట్ల షేర్ ఖాయమని వారు అంటున్నారు.
ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్ కావడంతో సినిమా హైప్ పీక్స్ లో ఉంది. దానితో అల వైకుంఠపురములో మిగతా సంక్రాంతి సినిమాల కంటే కొంత ముందు ఉంది. ఆ తరువాత సుకుమార్ డైరెక్షన్ ఇంకో సినిమా చేస్తున్నాడు బన్నీ. సుకుమార్ ఇప్పటికే రామ్ చరణ్ కు రంగస్థలం తో 100 కోట్ల సినిమా ఇచ్చాడు.
పైగా బన్నీ సుకుమార్ కాంబినేషన్ అంటే ఆర్య, ఆర్య 2 హైప్ ఎలాగూ ఉంటుంది. దానితో అది కూడా 100 కోట్ల షేర్ ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభాస్, చిరంజీవిలకు మాత్రమే బ్యాక్ టూ బ్యాక్ 100 కోట్ల షేర్ సినిమాలు ఉన్నాయి. దీనితో 2020 బన్నీ కెరీర్ లో కీలకం కాబోతుంది.
Union Minister and Karimnagar MP Bandi Sanjay’s son Bandi Bhageerath had been in the news…
The trailer for Dharma Productions' upcoming film Chand Mera Dil has been dropped and it…