
సినిమా, రాజకీయం అనేవి రెండు వేర్వేరు రంగాలు అయినప్పటికీ.. రెండూ కలిసే ఉంటాయి. హీరోహీరోయిన్లు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, రాజకీయ నాయకులు నిర్మాతలుగా మారి సినిమాలు రూపొందించడం, ఎలక్షన్స్ టైంలో పార్టీలను, నాయకులను సపోర్ట్ చేస్తూ ర్యాలీలు చేయడం అనేది సర్వసాధారణం.
అయితే.. ఇండస్ట్రీ మనుషులు గోడ మీద పిల్లుల్లా ఏ పార్టీ గెలిస్తే, ఆ పార్టీకి గొడుగు కాయడం అనేది కామన్. ఎందుకంటే ఒక సైడ్ తీసుకోవడం వల్ల వాళ్ల వృత్తి, వ్యాపారాలు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, ఆంధ్రాలో టీడీపీ పార్టీలకు సినిమా ఇండస్ట్రీ మద్దతు ఉంది.
వైసీపీ ఎందుకో ఇండస్ట్రీ సపోర్ట్ అందుకోలేకపోయింది. కొంతమంది ఆర్టిస్టులను, యాంకర్లను ప్యాకేజ్ తో మ్యానేజ్ చేశారే కానీ, ఇప్పటికీ సంపూర్ణ సపోర్ట్ అందుకోలేకపోయారు.
ఇప్పుడు కవిత స్థాపించిన టిఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన)కి సినిమా ఇండస్ట్రీ నుండి సపోర్ట్ లభించడం కష్టమే అనిపిస్తోంది. ఒకపక్క రేవంత్ రెడ్డి, మరోపక్క కేటీఆర్ లను కాదని కవితకి సినిమా సెలబ్రిటీలు సపోర్ట్ చేయడం, స్వచ్ఛందంగా క్యాంపైనింగులు చేయడం అనేది అనితరసాధ్యం.
ఎంత కాదు అనుకున్నా.. పొలిటికల్ పార్టీకి గ్లామర్ క్యాంపెయినింగ్ అవసరమే. మరి ఈ విషయంలో కవిత ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి.
తెలంగాణ రాజకీయంగా ఎదగాలి అంటే అందుకు వారి తక్షణ కర్తవ్యం టీడీపీ పార్టీ మీద రాజకీయ ఆరోపణలు చెయ్యాలి, ఆ…
A recent viral clip has put SS Rajamouli’s upcoming magnum opus Varanasi under unexpected trolling.…