Telugu

హరిహర వీరమల్లు – ఈ సారైనా వచ్చేనా?

పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా “హరిహర వీరమల్లు: పార్ట్ 1” 2020లో ప్రకటించినప్పటి నుంచి అభిమానులను ఎదురు చూసేలా చేస్తుంది. భారీ బడ్జెట్, హిస్టారికల్ కథాంశం, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఐదేళ్లు దాటినా సినిమా విడుదల కాలేదు, షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఎక్కువ రోజులు వేచి ఉండలేక క్రిష్ కూడా ప్రాజెక్ట్ నుంచి పక్కకి తప్పుకున్నారు. ఆ తరువాత మిగిలిన సినిమా పూర్తి చేయడానికి డైరెక్టర్ గా జ్యోతికృష్ణ రంగంలోకి దిగారు.

రాజకీయాలలో బిజీ బిజీగా ఉన్న పవన్, డిప్యూటీ సీఎం హోదాలో పలు శాఖలను కూడా నిర్వహిస్తుండడంతో ఈ సినిమా కోసం సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. పవన్ షూటింగ్ ఇంకా నాలుగు రోజులు పెండింగ్ ఉందని చెప్తున్నారు. ఇదిగో అదిగో అని చాలా నెలల నుంచి ఊరిస్తున్నా కూడా షూటింగ్ మాత్రం అవ్వలేదు. ప్రతి నెలా ఈ సారి షూటింగ్ కి వస్తారు అని అనుకోవడం, అనివార్య కారణాలతో పవన్ రాలేకపోవడంతో సినిమా వాయిదా పడుతూ వస్తుంది. మే 9 న విడుదల అని చెప్తున్నా కూడా చిత్ర యూనిట్ నుంచి ఆ హడావిడి కనిపించట్లేదు.

ADVERTISEMENT

పవన్ కళ్యాణ్ చిన్న కొడుకుకి సింగపూర్లో అగ్ని ప్రమాదం జరగడంతో అక్కడికి వెళ్లి వచ్చారు. ఇప్పుడు ఆరోగ్యం సహకరించకపోవడంతో అత్యవసర సమావేశాలు తప్ప బయట కనిపించడం లేదు. తిరుపతి వెళ్లాల్సిన షెడ్యూల్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇలాంటి సమయంలో పవన్ నిజంగా వీరమల్లు కోసం నాలుగు రోజులు కేటాయించగలుగుతారా? డబ్బింగ్ పూర్తి చేయగలుగుతారా? పీరియాడిక్ మూవీ అవ్వడం వలన ఎడిటింగ్ కి సమయం సరిపోతుందా? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలే. అందుకే అభిమానుల్లో కూడా రిలీజ్ డేట్ మీద నమ్మకం లేకుండా పోయింది.

ఎం ఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు రెండు పాటలని రిలీజ్ చేసారు. అందులో మాటవినాలి అనే పాటని పవన్ కళ్యాణ్ స్వయంగా పాడారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేయగా, బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అనసూయా భరద్వాజ్ ఒక సాంగ్ లో కనిపించనున్నారు.

పవన్ కళ్యాణ్ తో సుజీత్ దర్శకుడిగా షూటింగ్ దశలో ఉన్న మరో చిత్రం OG. అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్న సినిమా ఇది. ఇప్పుడున్న పరిస్థితుల్లో OG సినిమా పూర్తి అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పటికి కనీసం హరిహర వీరమల్లు తో అభిమానులను కొంచెం ఉత్సాహ పరిస్తే, OG కోసం మరికొన్ని సంవత్సరాలు వేచి చూస్తారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

December 4 Clash: Nithiin vs Naga Chaitanya

Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…

26 minutes ago

First Direction, Next Acting? Jason Sanjay in the Spotlight

Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…

55 minutes ago