
[m9ad]
ఏపీ, తెలంగాణాలతో పాటు త్రివిక్రమ్ అడ్డాగా భావించే యుఎస్ లోనూ ఈ సినిమా బలంగా ఉంది. ఇప్పటికి ఈ సినిమా యుఎస్ లో 1.26 మిలియన్ డాలర్స్ ను సొంతం చేసుకుంది. ఇక్కడ సినిమా రేంజ్ ను శనివారం నాడు డిసైడ్ కానుంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం 2 మిలియన్స్ దరిదాపుల్లోకి చేరుతుందని భావిస్తుండగా, అసలు ఏ క్లబ్ లో ల్యాండ్ అవుతుందోనని అంతా ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాదిలో ‘రంగస్థలం, భరత్ అనే నేను’ సినిమాలతో చెర్రీ అండ్ మహేష్ లు 3 మిలియన్ క్లబ్ లోకి అడుగుపెట్టారు.
దీంతో ‘అరవింద సమేత’కు కూడా మంచి మౌత్ టాక్ లభిస్తే, 3 మిలియన్స్ సొంతం చేసుకుంటుందని భావించగా, అది ప్రస్తుతం అసాధ్యంగా కనపడుతోంది. ప్రీమియర్స్ తర్వాత కలెక్షన్స్ అంచనాలు వేయలేని విధంగా తగ్గుముఖం పట్టాయి. ఒకవేళ శనివారం నాడు భారీ కలెక్షన్స్ ను సాధించని పక్షంలో 2 మిలియన్స్ కూడా కష్టసాధ్యమేనని పేర్కొనవచ్చు. ఇదే సమయంలో అగ్ర హీరోలు మహేష్, రామ్ చరణ్ లు కాకుండా విజయ్ దేవరకొండ 2 మిలియన్స్ క్లబ్ లో ఎంటర్ అయ్యాడు. దీంతో పరోక్షంగా త్రివిక్రమ్ – తారక్ కాంబోపై ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంది.lion club
Trivikram Srinivas had special praise for Venkatesh at the pre-release event of Aadarsha Kutumbam: House…
Mahesh Babu and SS Rajamouli’s ambitious film Varanasi has generated massive expectations, with audiences eagerly…