
అయితే పెద్ద సినిమాలు వస్తాయి అనే లోగా రెండో వేవ్ వచ్చేసింది. సెకండ్ మూడు నెలల పాటు విసిగించి తగ్గుముఖం పట్టింది. అయితే మునుపటి వేగం ఈ సారి లేదు. కరోనా అనిశ్చితి, ఏపీలో థియేటర్ల సమస్యల మధ్య ఈ వారాంతంలో రెండు చిన్న సినిమాలు విడుదల అవుతున్నాయి.
స్టార్ హీరోలు ప్రభుత్వాన్ని అనలేక అలాగే ఏ చెయ్యాలో తోచక చూస్తూ ఉండిపోయారు. సెకండ్ వేవ్ తగ్గిన నాటి నుండీ ఏదైనా సందర్భం వస్తే పెద్ద సినిమాల పోస్టర్లు, టీజర్లు విడుదల చేస్తున్నారు. అయితే ఎప్పుడు విడుదల అవుతాయి అనే దాని మీద మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.
అందరిదీ వేచి చూద్దాం అనే ధోరణే. పిల్లికి మేడలో గంట ఎవరు కడతారు అనే చూస్తున్నారు అంతా. ఈ క్రమంలో మహేష్ బాబు సర్కారు వారి పాట టీజర్ ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు వస్తుందంట. ఆ టీజర్ లో డేట్ వేస్తేనైనా మిగతా వారిలో ఊపు వస్తుందేమో చూడాలి. అయితే ఇక్కడ ఇంకో తిరకాసు కూడా ఉంది. సర్కారు వారి పాట వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చే సినిమా.
ఆ డేట్ ఇప్పుడు చెప్పినా మిగతా పెద్ద సినిమాల మీద ప్రభావం ఉండకపోవచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి.
India's 2-2 T20I series draw against the West Indies has exposed a concern that the…
Kiran Abbavaram is gearing up for the holiday season with his upcoming family entertainer, Reality.…