Telugu

ఓవర్సీస్ లో నాచురల్ ‘స్టార్’ షాక్ ఇస్తాడా?

ప్రస్తుతం తెలుగు సినిమాకు అత్యంత కీలకమైన మార్కెట్ గా యుఎస్ అవతరించింది. చిన్న, పెద్ద అన్న సినిమాలతో సంబంధం లేకుండా ఓవర్సీస్ మార్కెట్లో తెలుగు సినిమాల హవా కొనసాగుతోంది. ఈ విభాగంలో నాచురల్ ‘స్టార్’ నాని కూడా గతేడాది యుఎస్ బాక్సాఫీస్ ను షేక్ చేసాడు. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో దాదాపుగా 1.4 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ను అందుకుని, ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చాడు.

అయితే ఇంతటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విడుదలైన ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్, విశ్లేషణలు వచ్చినప్పటికీ, యుఎస్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావితం చూపలేకపోయింది. ఈ సినిమాతోనే ‘నాచురల్ స్టార్’గా అవతారం ఎత్తిన నాని, ఆ ‘స్టార్’ రేంజ్ లో కలెక్షన్స్ ను అయితే వసూలు చేయలేకపోయాడు. ‘భలే భలే మగాడివోయ్’ సినిమా కలెక్షన్స్ లో కేవలం 50 శాతం వరకే అందుకోగలిగింది ‘వీరప్రేమగాధ.’

ADVERTISEMENT

దీంతో మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న ‘జెంటిల్మెన్’ సినిమాతో నాని ‘స్టార్’ రేంజ్ ఏంటో నిరూపించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. అయితే రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉన్నప్పటికీ, యుఎస్ లో ‘జెంటిల్మెన్’ ప్రీమియర్స్ కు ఆశించిన మేర ప్రేక్షకుల నుండి స్పందన రాకపోవడం విశేషం. కాంభినేషన్ రీత్యా కావచ్చు… లేక సినిమా ఉన్న జోనర్ రీత్యా కావచ్చు… ‘జెంటిల్మెన్’పై పెద్దగా బజ్ లేకపోవడం నాని సత్తాను ప్రశ్నించే విషయం.

అయితే ‘భలే భలే మగాడివోయ్’ సినిమాకు ముందు కూడా ఇలాంటి వాతావరణమే నెలకొని, సైలెంట్ గా విడుదలై సెన్సేషన్ సృష్టించింది. ‘జెంటిల్మెన్’ విషయంలో కూడా అదే రిపీట్ కావాలంటే… తొలి ఆట పడేటంత వరకు వెయిట్ చేయాల్సిందే! ఇటీవల కాలంలో భారీ అంచనాలతో విడుదలైన పెద్ద హీరోల సినిమాలు అంతకు మించిన భారీ ఫెయిల్యూర్స్ చూసిన తరుణంలో ‘అ… ఆ…’ మాదిరి ‘జెంటిల్మెన్’ కూడా షాక్ ఇస్తాడేమో చూడాలి.

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

Pics: Srijita Turns Mirror Poses Into Pure Glam

Srijita Ghosh turns a rain-kissed glass setting into a striking fashion frame, pairing delicate white…

5 minutes ago

Trivikram’s AK47 Oct 9: Holiday Jackpot or Too Crowded?

Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam has officially moved from October 2 to October 9. The…

35 minutes ago