
దీంతో చెర్రీ నటనపై భవిష్యత్తులో విమర్శలు వినిపించవా? చిట్టిబాబు లాగానే ప్రతి క్యారెక్టర్ లో జీవించేస్తాడా? ఇలాంటి ప్రశ్నలే చెర్రీకి గడ్డుకాలం ముందుందని సూచిస్తున్నాయి. చిట్టిబాబు పాత్రలో మెస్మరైజ్ చేసిన చెర్రీ ఇతర పాత్రలలో కూడా ఇంతే స్థాయిలో అలరిస్తాడా? అనేది రామ్ చరణ్ ఇంకా నిరూపించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ‘చిట్టిబాబు’ తరహా పాత్రలు దశాబ్దానికి ఒకటి వస్తుంటాయి.
చిట్టిబాబు ఆకారం, శరీరాకృతి… రొటీన్ తెలుగు సినిమాలలో చూసేది కాదు. గడ్డంతో కూడిన చెర్రీ లుక్ కూడా ఇతర పాత్రలకు సెట్ అయ్యేది కాదు. ఇదే రామ్ చరణ్ కు ఛాలెంజింగ్ గా మారిన అంశం. మున్ముందు ప్రేక్షకులు కూడా చెర్రీ యాక్టింగ్ గురించి మాట్లాడుకునేలా చేసిన చిట్టిబాబు, దానిని కొనసాగించగలరా? అనేది తెలియాలంటే ఈ ఏడాది సెకండాఫ్ లో రాబోతోన్న బోయపాటి సినిమా వరకు వెయిట్ చేయాల్సిందే.
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…