“శ్రీమంతుడు” రేంజ్ లో “సరైనోడు” నిలుస్తుందా?

ఇండస్ట్రీలో కొన్ని సెంటిమెంట్లు కొన్నింటికి ఊతమిస్తాయి. ముఖ్యంగా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న సినిమాలో ఏయే విషయాలు వర్కౌట్ అయ్యాయో అనే అంశాలను పలువురు నిశితంగా పరిశీలిస్తుంటారు. ఆ కోవలో ఓ సెంటిమెంట్ “సరైనోడు” సినిమాను “శ్రీమంతుడు” సినిమా అంత బ్లాక్ బస్టర్ హిట్ చేస్తుందని బలంగా నమ్ముతున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో చెర్రీ హీరోగా ఓ సినిమా ప్రారంభమై ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దరికి చేరడం, చివరగా ప్రిన్స్ ఒప్పుకోవడం… గతేడాది విడుదలై బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం జరిగిపోయాయి. రామ్ చరణ్ తో చెప్పిన స్టొరీ ‘శ్రీమంతుడు’ అవునో కాదో తెలియదు గానీ, సినిమా విడుదలైన సమయంలో మాత్రం చెర్రీ ‘శ్రీమంతుడు’కు నో చెప్పాడన్న వార్తలు వినిపించాయి. అలా ఇద్దరు కాదన్న కధతో ప్రిన్స్ మహేష్ బాబు తన సినిమాలలో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు అందుకున్నాడు.

ADVERTISEMENT

అయితే, “సరైనోడు” విషయంలో కూడా ఇలాంటి సెంటిమెంట్ రిపీట్ అయ్యిందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ముందుగా “సరైనోడు” సినిమా రామ్ చరణ్ వద్దకే వెళ్ళగా… చెర్రీ దీనికి నో చెప్పాడని, ఆ తర్వాత గోపీచంద్ తో తెరకేక్కిద్దామని వెళ్ళినా ప్రయోజనం లేకపోయిందని, ఫైనల్ గా ఆ ఇద్దరు కాదన్న కధతో బన్నీ “సరైనోడు”గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

‘శ్రీమంతుడు’ సినిమాను కాదన్న చెర్రీనే ‘సరైనోడు’ సినిమాను కాదనడం, అలాగే ఇద్దరు కాదన్న స్టొరీ మూడవ హీరోకు చేరుకునే పాటికి బ్లాక్ బస్టర్ రూపు సంతరించుకోవడం వంటి సెంటిమెంట్లు సినీ ఇండస్ట్రీలో సర్వ సాధారణమే. మరి అందరూ ఆశిస్తున్నట్లు “శ్రీమంతుడు” మాదిరే… “సరైనోడు” కూడా అల్లు అర్జున్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు చేసే సినిమాగా నిలుస్తుందేమో చూద్దాం.

Share
Published by

Recent Posts

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

1 hour ago

Sardar 2: Can Karthi Survive the Deadly Mandaadi Clash?

Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…

2 hours ago