
దీనితో అమరావతి నిర్మాణం అనేదే డోలాయమానంలో పడింది. అయితే దీనికి కారణం ఏమిటంటే… కొంత కాలం క్రితం అమరావతి వల్ల తమ అస్తిత్వానికే ముప్పు అని కొందరు రైతులు ప్రపంచబ్యాంకుకు ఈమెయిల్స్ పంపారు. అప్పట్లో వారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతో ఈ పని చేశారని అప్పటి ప్రభుత్వం విచారణలో తేల్చింది. దానితో రాజధానికి రుణం ఇవ్వాలంటే పూర్తిస్థాయిలో తనిఖీ నిర్వహించాల్సిందేనని ప్రపంచబ్యాంకు ఇన్‌స్పెక్షన్ ప్యానెల్ స్పష్టంచేసింది.
దానికి ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించని నేపథ్యంలో రుణం ప్రతిపాదనను విరమించుకుంది. దీని వెనుక కేంద్ర ప్రభుత్వ ప్రమేయం కూడా ఉందని సమాచారం. రాజధానికి రుణం కావాలంటే వేరే మార్గంలో చూద్దామని, ప్రపంచబ్యాంకు తనిఖీకి అంగీకరిస్తే, ఆ ప్రభావం బ్యాంకు ఆర్థిక సాయంతో దేశంలో చేపడుతున్న ఇతర ప్రాజెక్టులపైనా పడుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించినట్టు సమాచారం. ఈ నిర్ణయంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.
Indian travellers flying through Europe have received major relief after France removed a visa rule…
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…