Telugu

వరల్డ్ ఫేమస్ లవర్ … ఇంకా అర్జున్ రెడ్డి హ్యాంగ్ ఓవరేనా?

విజయ్ దేవరకొండ తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత మరోసారి విజయ్ పూర్తిగా అర్జున్ రెడ్డి తరహా ప్రేమకథతోనే వస్తున్నాడని అర్థమైపోతుంది. ప్రేమంటే ఒక కాంప్రమైజ్‌కు అర్థం.. ప్రేమంటే సాక్రిఫైజ్.. ప్రేమంటే దైవత్వం ఉంటుంది.. అవేవీ నీకు అర్థం కావంటూ టీజర్ మొదలైంది.

రాశీ ఖన్నా వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ టీజర్‌లో చాలా చూపించాడు దర్శకుడు క్రాంతి మాధవ్. నాలుగు రకాల క్యారెక్టర్లతో నలుగురు హీరోయిన్లతో విజయ్ కనిపించాడు. దీనితో కథ ఏమైవుంటుంది అనే ఆసక్తి కలుగుతుంది. అయితే సినిమాలో రొమాన్స్, సెక్స్, బాధ, కొన్ని గాఢమైన డైలాగులు మనకు అర్జున్ రెడ్డిని గుర్తు చెయ్యక మానదు.

ADVERTISEMENT

అయితే అర్జున్ రెడ్డి టెంప్లేట్ నే గనుక వాడితే మాత్రం విజయ్ భంగపడక తప్పదు. ఆ విషయం పక్కన పెడితే టీజర్ లోని చాలా షాట్స్ ఇంటెన్స్ గా ఉన్నాయి. మరోవైపు ఈ చిత్రం చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. గీత గోవిందం తరువాత సరైన హిట్ లేకపోవడంతో విజయ్ కెరీర్ ఒక్కసారిగా డైలమాలో పడిపోయింది.

కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడిపోయాడు విజయ్. ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రేమ నేపథ్యంలోనే ఈ చిత్రం వస్తుంది.. పైగా టైటిల్ కూడా వరల్డ్ ఫేమస్ లవర్ కాబట్టి లవర్స్ డే అయిన ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఎవరి బాబు నీళ్ళవి? నిజమే ఎవరి బాబువి కావు!

తెలంగాణలో కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ పార్టీల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరులో బీఆర్ఎస్‌ పార్టీ నిత్యం ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నామస్మరణ…

16 minutes ago

CBN, PK Meet Again Over MPTC, ZPTC Seat Sharing

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan have reportedly…

28 minutes ago