
2019 ఎన్నికల ముందు వైసీపీ, అప్పటి తెరాస కి భజన చేస్తూ మెగా స్టార్ కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తూ మీడియా ముందు రెచ్చిపోయిన సినీ రచయిత చిన్ని కృష్ణ తాజాగా తాను చేసిన తప్పేంటో తెలుసుకుని తనను క్షమించాలంటూ మరో వీడియో ను విడుదల చేసారు.
చేసిన తప్పు తెలుసుకోవడం మంచి విషయమే అయినప్పటికీ ఎవరో నన్ను ప్రలోభ పెట్టారు, అందుకే ఆ సమయంలో నేను అలా మాట్లాడాల్సి వచ్చింది అంటూ క్షమాపణలు అడగడం అటువంటి స్థాయి వ్యక్తులకు సబబేనా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. మంచితనాన్ని కూడా చేతకాని తనంగా భావించి ఇటువంటి విమర్శలు చేసిన వారిని సైతం క్షమించడం ఒక చిరంజీవి వల్లే సాధ్యం. నేటి రోజులలో మెగాస్టార్ లా జీవించిచడం అంటే చాల కష్టమే అంటున్నారు ఆయన అభిమానులు.
గత ఎన్నికల సమయంలో 40 ఇయర్స్ పృథ్వి తో పాటుగా వైసీపీ ట్రాప్లో పడిన చిన్ని కృష్ణ కు దాదాపు 5 ఏళ్ల తరువాత తత్త్వం బోధపడినట్లు ఉంది. కాపు సోదరులందరికి చెప్పదేమి అంటే..,మీకు, మీ జీవితాలకు మంచి జరగాలంటే ఖచ్చితంగా జగన్ కు ఓటువేయాలని అభ్యర్థిస్తున్నా..అంటూ చిరంజీవిని, పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శించారు.
నేను నోరు విప్పితే మీరందరు ‘నవరంద్రాలు’ మూసుకుంటారు, ఆ పరిస్థితి దాక నన్ను రెచ్చగొట్టకండి అంటూ అటు మెగా అభిమానులను,ఇటు జనసేన మద్దతుదారులను రెచ్చకొట్టిన చిన్ని కృష్ణ కు ఇప్పుడు తన ‘నవరంద్రాలు’ తెరుచుకున్నాయా..?అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
చిరంజీవికి కేంద్రం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించడంతో అటు సినీ రంగ ప్రముఖులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆ నేపథ్యంలోనే చిన్ని కృష్ణ కూడా మెగాస్టార్ ఇంటికి వెళ్లి ఆయనకు అభినందనలు తెలియచేసారు. ఆ సమయంలో చిరు గత సంఘటనలను మనసులో పెట్టుకోకుండా ఆయనతో ప్రవర్తించిన తీరుకు చిన్నబుచ్చుకున్న చిన్ని గతంలో తానూ ఆయన పట్ల ప్రవర్తించిన తీరుకి, మాట్లాడిన మాటలకూ సిగ్గుతో క్షమాపణలు కోరుకుంటున్న అంటూ ఒక వీడియో రిలీజ్ చేసారు.
అలాగే చిరంజీవి కలసి పని చేద్దాం ఏదైనా కథ ఉంటే తీసుకురా అంటూ తనను అడగడం తో చిరు సంస్కారానికి నిజంగా క్షమాణాలు చెపుతున్నాను అంటూ చిన్ని చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికైనా “స్వార్దానికి సంస్కారానికి” మధ్య తేడా గమనించారు సంతోషం అన్నయ్య పెద్ద మనస్సు అర్ధం చేసుకున్నారు అంటూ మెగాస్టార్ అభిమానులు ఈ వీడియో ను వైరల్ చేస్తున్నారు.
అయితే మెగా స్టార్ చిరంజీవి అన్నా ఆయన కుటుంబం అన్నా వైస్ ఫ్యామిలీకి ఎంత చిన్న చూపో చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు సాక్ష్యాలుగా నిలిచాయి. చిరు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన కొత్తలో హీరో రాజశేఖర్ వివాదం వెనుక, ఆయన స్థాపించిన సేవా సంస్థ అయిన బ్లడ్ బ్యాంకు వివాదం విషయంలో, అలాగే చిరు రెండవ కూతురి వివాహ వివాదంలో, అలాగే ఆయన పెద్ద కూతురు ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు దొరికిన విషయంలో అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ప్రచారం గట్టిగానే సాగింది.
అలాగే జగన్ ప్రభుత్వంలో కూడా సినీ సమస్యల పరిష్కారానికి అని సినీ పెద్దలను తాడేపల్లి పాలస్ కు పిలిపించుకుని అక్కడ మెగాస్టార్ తో జగన్ ప్రవర్తించిన తీరు దగ్గర నుండి ఆయన కుటుంబ సభ్యుల మీద తన సైన్యంతో..పోసాని, బోరుగడ్డ, కత్తి మహేష్, శ్రీరెడ్డి, ఆర్జీవీ…ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయ నాయకుల హామీల లిస్టులంతా ఉంటుంది వీరి జాబితా. వీరందరిని పావులుగా వాడుకుంటూ మెగాస్టార్ కుటుంబం పై ఎప్పుడు విషం జిమ్ముతూనే ఉంటారు.
India's team management has come under backlash for constantly changing its opening combination in T20Is.…
Rajinikanth is going to return to the big screen tomorrow with his new film Jailer…