జగన్ మీడియా అత్యుత్సాహానికి మరో ‘నిదర్శనం!’

జరిగింది రాయడం వేరు… ఊహించుకుని రాయడం వేరు… ఈ రెండవ రకాన్ని జగన్ వర్గపు మీడియా ఎక్కువగా ఫాలో అవుతోందని వీక్షకులకు తెలిసిన విషయమే. ముఖ్యంగా జగన్ కు సహకారం అందించే వెబ్ మీడియా వాస్తవాలకు దూరంగా రాతలు రాస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణగా ఢిల్లీలో పర్యటించిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ గురించి చెప్తున్నారు.

జగన్ వర్గపు మీడియా ఊహ :

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఢిల్లీలో “రహస్య భేటీ” జరగబోతుందని, దీనికి ఓ ప్రముఖ కేంద్ర మంత్రి ఏర్పాట్లు చేసారని, ‘ఓటుకు నోటు’ కేసుతో ఇబ్బందుల్లో ఉన్న ఏపీ సిఎం చంద్రబాబు, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో ‘సంధి’ చేసుకునేందుకు ముందుకు వచ్చారని… అందుకే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో తన పార్టీ ఎమ్మెల్యేలను ‘కారెక్కిస్తున్నా’ కేసీఆర్ పై ఎలాంటి విమర్శలు చేయడం లేదని… ఇలా రకరకాలుగా విశ్లేషణలు చేస్తూ కధనాలను ప్రచురించింది.

ఢిల్లీలో జరిగిన వాస్తవం :

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కూతురు వివాహ రిసెప్షన్ సందర్భంగా ఎదురుపడ్డ చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లు ఒకరినొకరు అభివాదం చేసుకున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు కూడా పలకరించుకున్నారు. ముందుగా ఢిల్లీ చేరుకున్న కేసీఆర్ తన చండీయాగానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను పంపిణీ చేయగా, ఆ తర్వాత ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు, పలువురి కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి ఏపీ సమస్యల గురించి చర్చించారు.

మీడియాలో ఊహాజనితమైన రాతలు రాయడం సహజమే. అందులోనూ రాజకీయ రంగానికి సంబంధించి మరీ ఎక్కువగా ఉంటాయి. అయితే ఊహాజనితం ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉండాలి. లేనిపక్షంలో సదరు మీడియా వర్గాల పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, గుర్తింపును కోల్పోవాల్సి వస్తుంది. ‘కాబోయే సిఎం’ తానే అంటూ జగన్ ఊహాల్లో తేలియాడుతుంటే… ఆయనకు సహకారం అందించే మీడియా కూడా ఊహల్లో విహరించడంలో తప్పేముందిలే… అన్న వ్యాఖ్యలు విశ్లేషకుల నుండి వస్తున్నాయి.

Share
Published by

Recent Posts

Vijaya Sai New Party: But Who’s The CM?

After being a crucial member in the team of former CM YS Jagan for more…

17 minutes ago

RGV’s Scary AI Take: What Will Humans Do Next?

Ram Gopal Varma has once again raised a disturbing question about AI. And this time,…

37 minutes ago