
ఈ నెల 9వ తేదీ నుండి షూటింగ్ మొదలు కాబోతున్న వైఎస్సార్ బయోపిక్ టైటిల్ లోగోను కాలు పాద ముద్రతో చూపిస్తూ “యాత్ర”గా ఖరారు చేసి విడుదల చేసారు. సినిమా పరంగా ఈ టైటిల్ లోగో డిజైనింగ్ ఆకట్టుకుంటుంది. ‘ఆనందో బ్రహ్మ’ దర్శకుడు మహి వీ రాఘవ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో వైఎస్సార్ గా ప్రముఖ నటుడు మమ్ముట్టి నటించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలే లక్ష్యంగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలలో ఎవరిదీ డామినేషన్ గా ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంది.
ఈ తరానికి తెలియని కధ కావడంతో ఎన్టీఆర్ బయోపిక్ పై ఆసక్తి కలగడం సహజం. అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనం సినీ ప్రేక్షకులను ఊరించే అంశం. అలాగే 2 రూపాయలు వంటి సంక్షేమ కార్యక్రమాలు, మహిళలకు ఆస్తి హక్కు, హైదరాబాద్ లో అల్లర్ల నియంత్రణ ఎన్టీఆర్ పాలనలో హైలైట్స్. దీనికి తోడు సొంత మనిషి అవినీతికి పాల్పడితే, సహించని వ్యక్తిత్వంగా ఎన్టీఆర్ పాలనను చెప్పుకుంటుంటారు.
ఇలా ఎన్టీఆర్ జీవితంలో హీరోయిజానికి సంబంధించిన అంశాలు ఎన్నో ఉండగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో ‘ఆరోగ్య శ్రీ, ఫీజు రీ ఎంబర్స్ మెంట్’ వంటి పధకాలు హైలైట్స్ గా నిలవనున్నాయి. వైఎస్ పాలన ఈ తరం ప్రజలకు బాగా సుపరిచితం. అయితే వైఎస్ కు ఉన్న పాజిటివ్స్ ఏ స్థాయిలో ఉన్నాయో, నెగటివ్స్ అంతే స్థాయిలో ఉండడం కలవర పెట్టే అంశం. ముఖ్యంగా అవినీతిమయంగా మారిన నాటి ఆంధ్రప్రదేశ్ తీరుతెన్నులు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే ఇది సినిమా కాబట్టి ఆయా బయోపిక్స్ లో వారికి అనుకూలంగా ఉన్నవే ఉంటాయి కాబట్టి, వైఎస్సార్ కు ప్రతికూలంగా ఉన్న అవినీతి అంశాన్ని టచ్ చేయకపోవచ్చు. అలాగే ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కొన్ని దురదృష్ట ఘటనలు కూడా వెండితెర రూపం సంతరించుకోకపోవచ్చు. ఓవరాల్ గా… పాలన విషయానికి వస్తే నాడు ఎన్టీఆర్ పాలనలోని ముఖ్య అంశాలను పాతికేళ్ళ తర్వాత మళ్ళీ వైఎస్ అమలుపరచడం ఖచ్చితంగా ఎన్టీఆర్ బయోపిక్ ను ఒక మెట్టు పైన నిల్చోబెడుతోంది.
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…