
అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “అసలు ఆయన దావోస్ వెళ్ళేందుకు సిబిఐ కోర్టు నుంచి అనుమతి తీసుకొన్నారా?ఒకవేళ అనుమతి తీసుకొన్నట్లయితే మద్యలో లండన్లో దిగుతున్నట్లు కోర్టుకు తెలిపి దానికీ ఆయన అనుమతి తీసుకొన్నారా?అసలు దావోస్ వెళ్తానని చెప్పిన సిఎం జగన్మోహన్ రెడ్డి మద్యలో లండన్లో ఎందుకు దిగారో చెప్పాలి.
మూడేళ్ళుగా దావోస్ ఊసే ఎత్తని సిఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హటాత్తుగా అక్కడికి ఎందుకు బయలుదేరారు? రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడానికా లేదా తన అక్రమార్జనను స్విస్ బ్యాంకులోకి తరలించేందుకా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అసలే దయనీయంగా ఉంటే, సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో దావోస్ వెళ్లవలసిన అవసరం ఏమిటి?అధికారులతో కలిసి అంతర్జాతీయ విమానంలో వెళ్లవచ్చు కదా?సిఎం జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళి ఏమి సాధించుకొని వస్తారో తెలియదు కానీ ఆయన విమానఖర్చుల భారం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలే భరించాల్సి ఉంటుంది,” అని యనమల రామకృష్ణుడు అన్నారు.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…