Telugu

పొట్టివాడు రామ్ చరణ్ హీరో అయ్యాడని కూడా అనొచ్చుగా!

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మీద చేసిన వ్యాఖ్యల రాద్దాంతం తెలిసిందే. అయితే దీనిపై నాగబాబు ఫైర్ అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ యండమూరి మండిపడడం వంటివి మీడియా వేదికలుగా హంగామా చేయగా, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యండమూరి మళ్ళీ ఈ ఉదంతంపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసారు.

ADVERTISEMENT

ఒక హీరో ముక్కు సరి చేయించుకున్నాడు, కళ్ళు సరి చేయించుకున్నాడు… అవి ఇవి అంటే అతనిపై ప్రేక్షకులలో చులకన భావన కలిగే అవకాశం ఉంది కదా… అని సదరు మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన యండమూరి… “అలా ఎందుకు, ఓ పొట్టివాడు హీరో అయ్యాడు కదా అని కూడా అనుకోవచ్చు కదా…” అంటూ రామ్ చరణ్ ఉద్దేశిస్తూ సంభోధించారు.

అయినా రూపురేఖలు వర్ణించడం అనేది ‘బ్యాడ్’ అని తాను ఎప్పుడు అనుకోలేదని, గతంలో శ్రీదేవి ముక్కు ఆపరేషన్ చేయించుకున్నపుడు కూడా మాట్లాడానని, బాగుండడం కోసమని కొంతమంది హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంటారని, కొంతమంది హీరోలు కళ్ళ క్రింద ఇంజక్షన్స్ చేయించుకుంటారని, దానిని నెగటివ్ కామెంట్ అని తాను అనుకోనని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

తాను పొరపాటుగా మాట్లాడానని అప్పుడు అనుకోలేదు గానీ, అది తనకు సంబంధం లేని మ్యాటర్ అని, ఇప్పుడు అనుకుంటున్నానని, వాళ్ళు ఎలా పోతే తనకెందుకు అని ఇప్పుడు తనకు అనిపిస్తోందని చేసిన యండమూరి తాజా వ్యాఖ్యలు మరెన్ని కలకలాన్ని సృష్టిస్తాయో చూడాలి. రామ్ చరణ్ ను పొట్టివాడిగా అభివర్ణిస్తే… మెగా ఫ్యాన్స్ రియాక్షన్స్ ఎలా ఉంటుందో మరి…?!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Akshay Kumar’s Jim Corbett Film: Another Risky Reunion?

Akshay Kumar is set to reunite with Priyadarshan for another film, but unlike their usual…

14 minutes ago

ENE Repeat: Toughest Challenge for Tharun Bhascker?

Ee Nagaraniki Emaindi was not a big box-office success when it was released in 2018.…

24 minutes ago