Telugu

ఆమె చెప్పులలో తప్పులు… వైసీపీ స్థాయి ఇంతే!

అమరావతి నిర్మిస్తుంటే ప్రపంచ బ్యాంకుకి లేఖలు వ్రాసి అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది. చివరికి రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు తెస్తున్నా వైసీపీ వ్యతిరేకిస్తుంది.

తాము అధికారంలోకి వస్తే ‘రప్పా రప్పా తలకాయలు నరుకుతామని’ జగన్‌ ఫోటోలతో పోస్టర్లు వేసి మరీ బెదిరిస్తుంటుంది.

ADVERTISEMENT

ఇలా బెదిరిస్తుంటే ప్రజలు తమని చూసి భయపడి గెలిపిస్తారని వైసీపీ అనుకుంటోంది. కానీ ఆ భయంతోనే తమకు ఓట్లు వేయరని వైసీపీ గ్రహించడం లేదు.

వైసీపీ డీఎన్ఏలోనే ‘ఫ్యాక్షన్ కణాలు’న్నాయి కనుక అది అలాగే ప్రవర్తిస్తుందని సరిపెట్టుకున్నా, చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో నుంచి చూపిస్తూ దుష్ప్రచారం చేస్తుంటే, తమ పట్ల ప్రజలలో వ్యతిరేకత మరింత పెరుగుతుందని గ్రహించడం లేదు.

సిఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిన్న కుప్పం నియోజకవర్గంలో ఓ పాఠాశాలకు వెళ్ళి అక్కడ బాలికలతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఆమె పక్కన కూర్చొని భోజనం చేసిన విద్యార్దినులు అందరూ బూట్లు వేసుకునే భోజనం చేశారు. ఎందుకంటే వారు భోజనం చేసిన వెంటనే మళ్ళీ తరగతులకు హాజరు కావాలి కనుక.

కానీ నారా భువనేశ్వరి గారు చిన్న బల్లపై కూర్చొని భోజనం చేసే ముందు చెప్పులు విడిచి, అవి కనపడకుండా తన చీర కుచ్చెళ్ళతో కప్పి భోజనం చేశారు.

ఇది వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ కి పెద్ద తప్పుగా కనిపించింది. సోషల్ మీడియాలో ఆ వీడియో పెట్టి విద్యార్ధినుల భోజనం ప్లేట్ల పక్కన భువనేశ్వరిగారు చెప్పులు పెట్టడంతో ఇబ్బంది పడ్డారంటూ దుష్ప్రచారం మొదలు పెట్టేసింది.

ప్రధాన ప్రతిపక్షహోదా కావాలంటూ కోర్టుకెక్కిన వైసీపీకి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే బదులు ఇలా భువనేశ్వరిగారి చెప్పుల గురించి మాట్లాడుతుండటం చూస్తే, వైసీపీ ఇలాంటి నీచ రాజకీయాలు తప్ప మరేమీ చేయలేదనిపిస్తుంది.

అనకాపల్లికి చెందిన వైసీపీ నేతలు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని, జగన్‌ పోస్టర్లు పట్టుకొని, ‘జై జగన్‌..’ అంటూ శబరిమలలో నినాదాలు చేయడం ఇంతకంటే పెద్ద తప్పే కదా? కానీ అది అభిమానమని నిర్లజ్జగా వెనకేసుకు వచ్చిన వైసీపీ, భువనేశ్వరిగారి చెప్పులలో తప్పులు వెతుకుతుండటం సిగ్గుచేటు!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

The Paradise Gets Positive Responses

Unlike the usual approach seen in recent times, the makers of The Paradise have chosen…

10 minutes ago

Jailer 2: Can Rajinikanth Break Tamil Sequel Curse?

Tamil cinema has not had a great run with big-ticket sequels. The first film works,…

15 minutes ago