
ప్రకాశం జిల్లాలో మార్కాపురం ఎంపీడీవో కార్యాలయంలో నిన్న మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశం మొదలవగానే వైసీపీకి చెందిన ఎంపీపీ పోరెడ్డి అరుణ ఓ కాగితం బయటకు తీసి దానిలో తమ పార్టీకే చెందిన ఎంపీడీవో టి.హనుమంతరావు ఏఏ పనులలో ఏవిదంగా దొంగబిల్లులు పెట్టి సొమ్ము డ్రా చేసుకొంటున్నదీ చదివి వినిపించారు. ఆయన ప్రతీ నెల లక్షకు తక్కువ కాకుండా సుమారు రూ.1.50 లక్షల వరకు ప్రభుత్వ సొమ్ము స్వాహా చేస్తున్నారని పోరెడ్డి అరుణ ఆరోపించారు. ఒక వాలంటీరు ఉద్యోగానికి రూ.7 నుంచి రూ.10,000 లంచం తీసుకొంటున్నారని ఆరోపించారు. ఇక సచివాలయం ఉద్యోగులు, పంచాయతీ పరిధిలో కార్మికులకు జీతాలు చెల్లించాలంటే నెలనెలా కనీసం రూ.35,000 ముట్టజెపితేనే, ట్రెజరీ నుంచి క్యాష్ డ్రా చేసి ఇస్తారని లేకుంటే ఉద్యోగులు, కార్మికులకు సకాలంలో జీతాలు అందకుండా ముప్పాతిప్పలు పెడుతున్నారని ఆరోపించారు.
వైసీపీ ఎంపీపీ పోరెడ్డి అరుణ తమ పార్టీకే చెందిన ఎంపీడీవో ఈవిదంగా అవినీతికి పాల్పడుతున్నారని సమావేశంలో అందరి ముందు కుండబద్దలు కొట్టినట్లు బయటపెట్టగా, అప్పుడు ఆయన కూడా అరుణ దంపతుల అవినీతి భాగోతం బయటపెట్టడం మరో విశేషం.
ఎంపీడీవో హనుమంతరావు ఆమెకు బదులిస్తూ, “మీ ఆయన చెంచిరెడ్డి ప్రతీ నెల లక్ష రూపాయలు ఇవ్వాలని నన్ను వేధిస్తున్నారు. అయినా ఏమీ తెలియనట్లు నేనే అవినీతిపరుడిని అన్నట్లు ఆరోపణలు చేయడం సరికాదు. మండల పరిషత్తుకి ఏడాదికి జనరల్ ఫండ్ కింద వచ్చేది కేవలం రూ.10 లక్షలే అయితే మీకు నెలనెలా లక్ష రూపాయలు నేనెక్కడి నుంచి తెచ్చివాలి? మా ఇంట్లో డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయనుకొన్నారా?” అని ప్రశ్నించేసరికి అందరూ నివ్వెరపోయారు. దాంతో ఎంపీపీ పోరెడ్డి అరుణ,ఆమె భర్త చెంచిరెడ్డి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడటంతో ఎంపీడీవో హనుమంతరావు కూడా వారిని ఆదే స్థాయిలో ఎదుర్కోవడంతో సమావేశం రసాభాసగా మారింది. చివరికి మిగిలిన సభ్యులు కలుగజేసుకొని వారిని శాంతింపజేశారు. అయితే వైసీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారనే విషయం తేటతెల్లమైంది. మండలస్థాయిలో ఒక ఎంపీపీ, ఏపీడీవో స్థాయిలోనే ఇన్ని లక్షల అవినీతి జరుగుతుంటే మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రుల స్థాయిలో ఎంత అవినీతి జరుగుతోందో అనే సందేహం కలుగక మానదు.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…