
గడిచిన మూడు సంవత్సరాల నుండి తనను అవమానిస్తూ వస్తున్నారని.. అయినా పార్టీ మీద., అధినేత మీద ఉన్న గౌరవంతో నోరుమూసుకున్నానని…, ఇక సహించేది లేదని తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఇప్పటివరకు భరించాం…,ఇకపై దేనికైనా సిద్ధం…,నాకు జరిగిన అన్యాయానికి న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తా అంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు వేణుగోపాల్.
మీరు తప్పులు చేస్తూ ఉండండి…..నేను ఆ తప్పులను లెక్కపెడుతూ ఉంటాను….అయితే చెప్పినట్టే లెక్క పూర్తయ్యింది. వంద తప్పులు చేసి మొన్నే నూటఒకటవ తప్పు కూడా మీరు చేశారు. ఇక లెక్క తేలింది శిశుపాలుడి మాదిరి నీ లెక్కను సరిచేయాల్సిన సమయం వచ్చింది అంటూ వేణు గోపాల్ శివప్రసాద్ రెడ్డి ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. నాకు అవమానం జరిగితే మీఅందరికి అవమానం జరిగినట్లే అంటూ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
దర్శి లో వర్గపోరు ఈనాటిదికాదు గడినచిన ఏడాదిన్నర కాలం నుండి ఈ ఇద్దరి నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యే వేణుగోపాల్ పని తీరు మీద సొంత పార్టీ నేతలే కర పత్రాలు పంచుతూ నియోజకవర్గంలో సందడి చేయడం ఆ పార్టీ అధిష్టానం వరకు వెళ్ళింది. పార్టీ పెద్దల చర్చలతో కాస్త సద్దుమనిగిన వీరి మధ్య వైరం ఇప్పుడు తార స్థాయికి చేరడం పార్టీ కార్యకర్తలను కంగారు పెడుతుంది.
2014లో వైసీపీ పార్టీలో చేరిన బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ తమను అణిచివేయడానికి చూస్తున్నారనేది వేణు గోపాల్ అనుచరుల వాదన. అయితే గత నాలుగురోజుల క్రితం జరిగిన బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహావిష్కరణ సభలో జగన్ కు అత్యంత సన్నిహితంగా శివప్రసాద్ రెడ్డి మెలగడం చూసిన వేణు గోపాల్ తనకు పార్టీ పెద్దల నుండి కూడా మద్దతు దక్కటంలేదనే ఆవేదనతో ఇటువంటి వ్యాఖ్యలు చేసుంటారని.., తన ఆవేశాన్ని తన అనుచరుల వద్ద వెళ్లబుచ్చారని సమాచారం.
ఈ ఒక్క నియోజకవర్గంలోనే కాదు గన్నవరం లో వంశీ – యార్లగడ్డ మధ్య.., తాజాగా తాడిపత్రి శ్రీదేవి – డొక్కా వర్గం మధ్య ఇదేవిధమైన వర్గ పోరు నడుస్తుంది. ఇక్కడ కూడా ఒకరి వర్గం పై మరొకరు బహిరంగ సవాళ్లు విసురుకుంటూ పార్టీ ప్రతిష్టను రోడ్డుకి ఈడుస్తున్నారు.
151సీట్లతో రాష్ట్రంలో బలంగా ఉన్నాం అంటున్న వైసీపీ కి ఇటువంటి వర్గపోరులే నట్టేట ముంచుతాయని గ్రహించాలి. లేకుంటే పార్టీ నేతలే కాదు ప్రజలు కూడా తమ చేయి దాటిపోతారు.
Misha Narang gives casual dressing a stylish little shakeup in this breezy photoshoot. An oversized…
Vishwaksen’s #CULT is gearing up for a worldwide theatrical release on October 30. The project…