Telugu

టీజర్ టాక్ – కంప్లీట్ ఫన్నీ అడల్ట్ ఎంటర్టైనర్!

“ఏడు చేపల కధ” పేరుతో గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న పోస్టర్స్ పబ్లిసిటీ, తాజాగా విడుదల చేసిన టీజర్ తో పతాక స్థాయికి చేరుకుంది. ‘ఎ కంప్లీట్ అడల్ట్ కామెడీ ఫిల్మ్’ పేరుతో ప్రారంభమైన ఈ టీజర్, చెప్పినట్లుగా నిముషంన్నర్రసేపు పూర్తి అడల్ట్ కామెడీని పండించారు.

ADVERTISEMENT

[m9ad]

తన ముందు అమ్మాయి ఎక్స్ పోజింగ్ చేస్తే చూసి తట్టుకోలేని అబ్బాయి కధే ఈ “ఏడు చేపల కధ.” ‘టెంప్ట్ రవి’ పేరుతో హీరో పండించిన అమాయకత్వపు అడల్ట్ కామెడీ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. అలాగే టాప్ లెస్ సన్నివేశాలను ఈ చిన్న టీజర్ లోనే చూపించి, సిల్వర్ స్క్రీన్ పైన తామేం చూపించబోతున్నారో చిత్ర యూనిట్ చెప్పకనే చెప్పింది.

ఈ టీజర్ ఖచ్చితంగా ట్రేడ్ వర్గాలను ఆకర్షిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. “ఆర్ఎక్స్ 100” మాదిరి కధలో దమ్ము, కొత్తదనం ఉంటే, ఎంత అడల్ట్ కంటెంట్ అయినా విజయం అందించడానికి ప్రేక్షకులు వెనుకాడరని నిరూపణ అయ్యింది. శ్యాం జే చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో అభిషేక్ పాచిపల నటించగా ఏలూరు శ్రీను సంగీతం అందించారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Rajamouli’s Master Plan for Varanasi OTT: Will It Work?

SS Rajamouli is known for changing the rules of Indian cinema, both in filmmaking and…

9 minutes ago

ఏబీవీ కి బెజవాడ ఓటర్ల ‘కమ్మ’నైన తీర్పు…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విజయవాడ రాజకీయాలకు ఎప్పుడు ఒక ప్రత్యేక స్థానమే ఉంటుంది. ఇక్కడి ఓటర్లలో రాజకీయ చైతన్యం ఎక్కువ. తమ…

22 minutes ago