
‘రంగస్థలం’ ప్రమోషన్స్ లో భాగంగా మొదటగా విడుదల చేసిన ‘ఎంత సక్కగున్నావే’ ఆడియో మాదిరే, తొలుత ఈ పాట వీడియో సాంగ్ నే రిలీజ్ చేసారు. ఆడియోతో పాటు వీడియో కూడా అద్భుతంగా ఉండడంతో, ఈ పాట యూ ట్యూబ్ క్లిక్స్ లో రికార్డులు సృష్టించడం ఖాయం. ధియేటర్లలో సందడి చేస్తూ ఉండగానే యూ ట్యూబ్ లోకి రిలీజ్ చేయడం చెప్పుకోదగ్గ విషయమే.
ఈ సినిమా ఆడియో సాంగ్స్ లో ‘రంగమ్మ మంగమ్మ’ అనే పాట ఏకంగా 60 మిలియన్ క్లిక్స్ తో టాలీవుడ్ చరిత్రను తిరగరాసింది. ఆ మాటకొస్తే… టాలీవుడ్ లోనే కాదు, దక్షిణాదిలోనే ఎక్కువ క్లిక్స్ అందుకున్న పాటగా ‘రంగమ్మ మంగమ్మ’ ఆడియో సాంగ్ నిలిచింది. ఇక ఈ పాట వీడియో వస్తే మళ్ళీ దుమ్ము దులుపుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో!
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…