
అయితే దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే రాసి… యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వినిపించాడట. ఎన్టీఆర్ దాని మీద ఆసక్తి కూడా కనబరిచాడని సమాచారం. కానీ నిన్న బయటకు వచ్చిన ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో, అతను ఈ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించలేదు. అతను కొరటాల చిత్రం మరియు కెజిఎఫ్ 2 దర్శకుడి (ప్రశాంత్ నీల్) చిత్రం గురించి మాత్రమే ప్రస్తావించాడు.
బుచ్చి బాబు సినిమా మీద ఎన్టీఆర్ కు ఆసక్తి ఉన్నా, అది పట్టాలెక్కడానికి కనీసం మూడేళ్ళు పడుతుంది. కరోనా మహమ్మారి కారణంగా మరింత ఆలస్యమైనా ఆశ్చర్యపోనవసరం లేదు. మూడు సంవత్సరాలు అనేది కెరీర్ ఆరంభంలో ఒక దర్శకుడికి చాలా ఎక్కువ సమయం. ఈ విరామంలో ప్రేక్షకులు బుచ్చి బాబు ను మరచిపోయే ప్రమాదం కూడా ఉంది.
కాబట్టి, యువ దర్శకుడు తన భవిష్యత్తు గురించి చాలా ఆందోళన చెందుతున్నాడట. ఇప్పటి పరిస్థితులను బట్టి ఎన్టీఆర్ కు ఒక మాట చెప్పి… అతను వేరే ఆప్షన్ గురించి ఆలోచిస్తే మంచిది. సుకుమార్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి గురువు గారు ఏదో ఒక ప్రాజెక్ట్ సెట్ చెయ్యకమానరు కదా!
A few months ago, the highly anticipated announcement promo of Kamal Haasan and Rajinikanth's reunion…
Hindi film industry has witnessed the work of various directors over the years. But a…