
అందులో భాగంగానే ఓ మీడియా సంస్థ ప్రేక్షకులను ప్రశ్నిస్తూ… చిరంజీవి, బాలకృష్ణ సినిమాలలో ఎవరిది చూస్తారని అడుగుతుండగా, మహిళా ప్రేక్షకులు మాత్రం వీరిద్దరూ కాదు, మహేష్ సినిమాలు చూస్తామంటూ బదులివ్వడం విశేషం. ‘మహేష్ సినిమాలు విడుదల చేయమనండి చూస్తాం, చిరు, బాలయ్య సినిమాలు కాదు’ అంటూ ఓ మహిళా అభిమాని తెలుపగా, మరో అభిమాని మాత్రం ‘తానూ కేవలం మహేష్ సినిమాలను మాత్రమే చూస్తానంటూ’ బదులివ్వడం విశేషం.
దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తోంది. ప్రిన్స్ అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తుండగా, ఈ సంక్రాంతి మహేష్ సినిమా రాకపోయినా, ప్రిన్స్ కొత్త మూవీకి సంబంధించిన టీజర్ మాత్రం విడుదల కావచ్చని తెలుస్తోంది. అయితే ఈ సంక్రాంతి మిస్ అయినా, నెక్స్ట్ సంక్రాంతికి మాత్రం ప్రిన్స్ సిద్ధమవుతున్నారని ఖచ్చితంగా చెప్పే సూచనలు కనపడుతున్నాయి.
The municipal elections in Andhra Pradesh ended on November 1, but the political battle did…
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar was released in theatres on…