
‘అల్లుడు శీను, స్పీడున్నోడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం, “జయ జానకి నాయక” సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా పబ్లిసిటీని ఆటోల వెనుక ఫ్లెక్సీలు పెట్టి మరీ ఇస్తున్నారు. కర్నూలులో జరిగిన ఓ ఆటో రాలీ సందర్భంగా తీసిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి అంతగా ఆ ఫోటోలో ఏముంది? అంటే… బెల్లంకొండ శ్రీనివాస్ ను ‘యంగ్ స్పీడ్ స్టార్’గా కీర్తించడమే..!
బెల్లంకొండ శ్రీనివాస్ ఫ్యాన్స్ పేరిట వెలిసిన ఈ ఫ్లెక్సీల ఆంతర్యం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇది కేవలం ఫ్లెక్సీల వరకే పరిమితమా..? లేక రేపు సిల్వర్ స్క్రీన్ పైన శ్రీనివాస్ పేరు ముందు ఈ ‘యంగ్ స్పీడ్ స్టార్’ అన్న బిరుదు పడుతుందా? అనేది చూడాలి. మొత్తానికి తన తనయుడిని ‘స్టార్ హీరో’గా నిలబెట్టడానికి బెల్లంకొండ చేయని ప్రయత్నాలు లేవన్నట్లుగా కనపడుతున్నాయి. అయితే ఇలా ‘స్టార్’ పెట్టుకుంటే స్టార్ హీరోలు కారు, బాక్సాఫీస్ వద్ద స్టామినా వచ్చిన తర్వాత ‘స్టార్’ పెట్టుకుంటే, దానికి సార్ధకత ఉంటుందన్న విషయాన్ని గమనించాలి.
Union Home Minister Amit Shah launched a political attack on Congress leader Rahul Gandhi and…
Actor Imran Khan, nephew of Aamir Khan, got slammed by the Bombay High Court for…