
ఛలో, భీష్మ లాంటి రెండు పెద్ద హిట్లు ఇచ్చిన వెంకీ కుడుముల రెండు సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉన్నాడు. చిరంజీవితో ప్రాజెక్టు ఓకే అయ్యాక అదిప్పుడు ఉందో లేదో తెలియని అయోమయం అభిమానుల్లో నెలకొంది. మళ్ళీ నితిన్ తోనే జట్టు కడుతున్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది కానీ అధికారిక ప్రకటన లేదు. ఉప్పెనతో సెన్సేషన్ సృష్టించిన బుచ్చిబాబు జూనియర్ ఎన్టీఆర్ కోసం చాలా టైం ఖర్చు పెట్టాడు. తీరా చూస్తే అది జరిగేలా లేదు. ఇప్పుడు రామ్ చరణ్ చుట్టూ తిరుగుతున్నాడు. ఇదేమవుతుందో తెలియదు. డెబ్యూ మూవీ మూడో ఏడులో అడుగు పెడుతోంది. ఫైనల్ గా ఎవరితో లాక్ అవుతాడో గురువు సుకుమార్ కూ తెలియదు
నాని జెర్సీతో ప్రశంసలు అవార్డులు దక్కించుకున్న గౌతమ్ తిన్ననూరి దాని హిందీ రీమేక్ కి అనవసరంగా టెంప్ట్ అయిపోయి డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. ఇవతల చరణ్ సినిమా చేజారిపోయింది. కట్ చేస్తే నాలుగేళ్లు తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తోంది కానీ ఓకే అయ్యేదాకా నమ్మలేం. అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా టాలీవుడ్ ని పూర్తిగా వదిలేశాడు కబీర్ సింగ్, ఇప్పుడు రన్బీర్ కపూర్ అనిమల్ చేస్తున్నాడు కానీ మూలాలు మర్చిపోయి ఇక్కడ సినిమాలు చేయకపోవడం వల్ల మరికొన్ని కల్ట్ మూవీస్ ని మనం పోగొట్టుకున్నట్టేగా. తిరిగి వస్తాడన్న గ్యారెంటీ ఎక్కడ.
విజయ్ దేవరకొండకు పెళ్లి చూపులు రూపంలో తొలి బ్రేక్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ ఆ తర్వాత తీసింది ఈ నగరానికి ఏమయ్యింది ఒకటే. అది కూడా అర్బన్ సెంటర్స్ లో మాత్రమే ఆడిన బొమ్మ. ఆ తర్వాత కొంత కాలం యాంకర్ గా, నటుడిగా, డైలాగ్ రైటర్ గా ఏవేవో అవతారాలు ఎత్తి తన అసలు బలమైన డైరెక్షన్ మాత్రం పక్కనపెట్టేశాడు. రీసెంట్ గా కీడా కోలాను స్టార్ట్ చేశాడు . అంటే ఆరేళ్ళ కాలంలో ఇతనిది మూడో సినిమా. ఇలా చెప్పుకుంటూ పొతే లిస్టు చాలానే ఉంది కానీ పరుగులు పెట్టడమే లక్ష్యంగా ఉండాల్సిన యువనెత్తురు ఇంత నెమ్మదిగా సరైన ప్లానింగ్ లేకుండా సాగడం బెస్ట్ టాలెంట్ ని ఎక్కువ బయటికి రాకుండా చేస్తోంది. చూసుకుని నడవటం మంచిదే కానీ మరీ కుంటుతూ వెళ్తేనే ప్రమాదం
New data is showing that H-1B petitions from Indian companies in the US have dropped…
Amyaela is setting the internet ablaze with a breathtaking new photoshoot that totally redefines modern…