
అటునుండి ఆయన కాన్వాయ్ తో కోర్టుకు చేరుకున్నారు. రెండు గంటల పాటు సీఎం జగన్ కోర్టులోనే ఉండనున్నారు. కోర్టు మెయిన్ గేట్ వరకే మీడియాకు అనుమతి ఇచ్చారు. కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఏర్పాట్లు చేశారు.
గత ఏడాది మార్చి 1న చివరిసారిగా ఆయన న్యాయస్థానంలో హాజరయ్యారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం.. గెలిచి ఆయన సీఎం కావడంతో అప్పటి నుంచి ప్రతి వారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వచ్చాయి. అయితే పదే పదే కోర్టుకు గైర్హాజరుకావడంపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి బీఆర్ మధుసూదనరావు ఈ నెల 3వ తేదీన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
తదుపరి విచారణకు ఆయన, రెండో నిందితుడైన వైసీపీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తప్పనిసరిగా హాజరుకావాలని…లేదంటే తగు ఉత్తర్వులు జారీ చేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్, విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరు కాక తప్పలేదు. అయితే ముఖ్యమంత్రి హోదాలో కోర్టు ముందు ముద్దాయిలా నిలబడాల్సి రావడం రాజకీయంగా కొంత ఇబ్బంది కలిగించేదే.
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…
The Tamil film industry must be very proud about the fact that one of their…