
సిఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ సూచన ఏదో యధాలాపంగా చేసినట్లు భావించలేము. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పనితీరుపై ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా, ఐప్యాక్ ద్వారా సమాచారం తెప్పించుకొంటూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కనుక మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతికి సంబందించి సమస్త సమాచారం కూడా సిఎం జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది గాబట్టే ఈవిదంగా సూచించి ఉండవచ్చు. పైగా వైసీపీ నేతల భూకబ్జాలు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాల గురించి తరచూ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి కూడా. కనుక జగమెరిగిన రహస్యం సిఎం జగన్మోహన్ రెడ్డికి తెలియదనుకోలేము. వారిని అవినీతికి పాల్పడవద్దని సూచించడం మంచిదే కానీ వారి అవినీతిని బయటపెడుతున్న మీడియా మీద అక్కసు వెళ్ళగక్కడమే తప్పు.
నిజానికి వారి అవినీతిని, అక్రమాలను మీడియా బయటపెడుతూ వైసీపీ ప్రభుత్వానికి చాలా సాయపడుతోందని సంతోషించాలి. ఒకవేళ ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నట్లయితే వెంటనే వారిని మంత్రివర్గంలో నుంచి తొలగించి ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకోవాలి. అప్పుడే ప్రభుత్వంపై ప్రజలకి కూడా నమ్మకం ఏర్పడుతుంది. కానీ అవినీతికి పాల్పడుతున్నవారిని అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే రాజకీయంగా వైసీపీ నష్టపోతుందని సిఎం జగన్ ఆందోళన వ్యక్తం చేస్తుండటమే విస్మయం కలిగిస్తుంది.
మంత్రులకి ఇటువంటి సూచన చేయడం ద్వారా వారిలో కొందరైనా అవినీతికి పాల్పడుతున్నారని సిఎం జగన్ స్వయంగా ఒప్పుకొని స్వయంగా బయటపెట్టుకొన్నట్లు అయ్యింది కదా?మరి అటువంటప్పుడు వైసీపీ నేతల అవినీతి గురించి మీడియా బయటపెడుతోందని బాధపడటం దేనికి?
సంక్షేమ పధకాలపేరుతో ఓట్లు వేసే ప్రజలకి గత మూడున్నరేళ్లుగా లక్షల కోట్లు పంచిపెడుతున్నా, ఇంకా ఇంత అభద్రతాభావంతో ఉండటం గమనిస్తే, ప్రజలలో వ్యతిరేకత నెలకొని ఉందని సిఎం జగన్ కూడా గుర్తించినట్లే ఉన్నారు. మొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “నా జిల్లాలో ప్రజా వ్యతిరేకత ఉన్నట్లే సిఎం జగన్ సొంత జిల్లాలో కూడా ప్రజా వ్యతిరేకత నెలకొని ఉంది. అది సహజం,” అని అనడమే ఇందుకు తాజా నిదర్శనం. కనుక వైసీపీలో అవినీతి, దాని పట్ల ప్రజా వ్యతిరేకత నెలకొని ఉన్నట్లు వారే స్వయంగా ధృవీకరించుకొంటున్నారు కదా?
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…