Telugu

జగన్ కావాలనుకున్నది పవన్ కళ్యాణ్ తో మాట్లాడిస్తున్నారా?

అదేంటి ఒక పక్క జగన్ పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతుంటే ఆయన జనసేనానితో మాట్లాడించడం ఏంటి అనుకుంటున్నారా? ఆవునేమో అని సందేహం వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ వర్గాలు. మొన్న ఆ మధ్య జనసేన నిజనిర్ధారణ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్ రాజీనామాలు చేస్తే ఉపయోగం లేదని, రెండు పార్టీలు కలిసి కేంద్రం మీద అవిశ్వాసం పెట్టాలని సూచించారు.

ఉండవల్లి మాట పట్టుకుని పవన్ కళ్యాణ్ కూడా అదే పల్లవి అందుకున్నారు. రెండు పార్టీలను అవిశ్వాసం పెట్టాలని సూచించారు. పవన్ కళ్యాణ్ మాట పట్టుకుని జగన్ వెంటనే చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరారు. అవిశ్వాసం పెట్టాలన్న పవన్ ప్రతిపాదనకు ఒప్పుకుంటున్నా అని, అవిశ్వాసానికి మేం సిద్ధం.. మీరు సిద్ధమా అంటూ టీడీపీకి జగన్ సవాల్, టీడీపీ అవిశ్వాసం పెడితే మద్దతిస్తాం అని జగన్ ప్రకటించారు. ADVERTISEMENT

జగన్ కావాలనుకున్నది పవన్ కళ్యాణ్ కు తెలియకుండానే ఉండవల్లి ద్వారా మాట్లాడిస్తున్నారా? అనే అనుమానం కలగకమానదు. ఉండవల్లి వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే రాజకీయ సన్యాసం అని చెబుతూ జగన్ కు ఇండైరెక్ట్ సాయం చేస్తున్నారు ఉండవల్లి.

ఆయనలో ఏం చూశారో ఏమో గానీ ఆయన న్యూట్రల్ మనిషి అని తెచ్చి నిజనిర్ధారణ కమిటీలో కూర్చోబెట్టారు పవన్ కళ్యాణ్. కమిటి సమావేశాల్లో కూడా ఒకటి రెండు సార్లు ప్రభుత్వం వ్యతిరేక స్వరం వినిపించబోతే జేపీ అడ్డుకున్నారు. రానున్న రోజులలో ఉండవల్లి సావాసం పవన్ కళ్యాణ్ ను ఎటు నడిపిస్తుందో!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Shivangi Elevates Desi Glam With Bold Charm

Shivangi Verma raises the fashion bar with a striking ethnic look that blends timeless elegance…

23 minutes ago

Anbe Diana: Positive Theatre Hype Falls Flat After OTT?

Kollywood film Anbe Diana starring Pari Elavazhagan in the lead and directed by him, was…

43 minutes ago