Telugu

పాపం మేడా… చమురు వదిలినా ఫలితం దక్కలేదు

రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వచ్చేశారు. 2014 ఎన్నికలలో టీడీపీ కడప జిల్లాలో గెలిచిన ఒకే ఒక్క సీటు రాజంపేట. ఒకరకంగా గాలిని పసిగట్టి పార్టీని మారిన వారిలో మొదటి వ్యక్తి మేడా అక్కడ నుండి ప్రవాహం ఆగలేదు. అప్పట్లో జగన్ ఆయనకు గెలిస్తే మంత్రి పదవి ఖాయం అని హామీ ఇచ్చారట. దీనితో మేడా కడప జిల్లాలోని ప్రతీ నియోజకవర్గానికి 10 కోట్లు ఫండ్, భారీ మొత్తంలో పార్టీ ఫండ్ కూడా ఇచ్చారని జిల్లాలో టాక్ వినిపించింది.

మళ్ళీ గెలిచారు మేడా. అయితే జగన్ తన కేబినెట్ విస్తరణలో మేడాకు మొండి చెయ్యి చూపించారు. సామజిక సమతుల్యం పేరుతో ఆయనను పక్కన పెట్టారు. రెండున్నర ఏళ్ళ తరువాత కేబినెట్ లోని 90% మంత్రులు మారిపోతారు అప్పుడు నీకు ఖచ్చితంగా అవకాశం వస్తుందన్నా అని చెప్పారట. ఒకింత నిరాశకు గురైనా ఇప్పుడు చెయ్యగలిగింది ఏమీ లేదు. మేడా మల్లిఖారున రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలోని స్థితిమంతులలో టాప్ 5 స్థానాలలో ఉంటారు.

ADVERTISEMENT

మంత్రివర్గ ఏర్పాటులో సంప్రదాయ టీడీపీ మద్దతుదారులుగా పరిగణించే బలహీన వర్గాలకు ప్రాధాన్యమిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాల్లో ఒక్కొక్కరికి ఉపముఖ్యమంత్రి పదవులు కేటాయించారు. కష్టనష్టాల్లో తన వెంట నిలిచిన వారికి ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా పదవుల పంపిణీలో అగ్రాసనం వేశారు. తొలిసారి పట్టు చిక్కిన ఈ జిల్లాల్లో దానిని మరింత పదిలం చేసుకునేందుకు ప్రయత్నించారన్న భావన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు మూడేసి చొప్పున తొమ్మిది స్థానాలు దక్కాయి.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

The “Weekend CM” Drama: YSRCP’s Identity Crisis?

The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…

33 minutes ago

“Even Drishyam 3 May Fail”: Mohanlal’s Viral Comments

Mohanlal is preparing for the release of his upcoming film Drishyam 3 directed by Jeethu…

52 minutes ago