
అయితే, నిన్న రాత్రి పొద్దపోయాక వీరి భేటీ వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల భేటీని 14వ తేదీకి వాయిదా వేశారు. చిరంజీవి, రామ్ చరణ్ ముఖ్యమంత్రిని తమ తాజా చిత్రం, సైరా నరసింహా రెడ్డి చూడాల్సిందిగా ఆహ్వానిస్తారట. సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాల్సింది గా కోరతారని కూడా వార్తలు ఉన్నాయి.
కాగా, చిరంజీవి కోరిక మేరకు ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కుటుంబంతో కలిసి సినిమాను వీక్షించారు. అద్భుతంగా ఉందంటూ చిరంజీవిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవనుండడంతో చిరంజీవి, రామ్ చరణ్ లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుస్తారని సమాచారం.
ఇది ఇలా ఉండగా సైరా కీలకమైన వారాంతంలోకి ప్రవేశించబోతుంది. ఈ వారాంతంతో దసరా సెలవుల అడ్వాంటేజ్ కూడా ముగిసిపోనుంది. కనీసం యావేరేజ్ అనిపించుకోవాలన్నా 80% రికవరీ ఉండాలి. ప్రస్తుత పరిస్థితులలో అది అంత తేలిక కాదని తెలుస్తుంది. అయితే ఇప్పటికే మిగతా భాషలలో సినిమా పూర్తిగా డల్ అయిపోయింది.
The TDP-JanaSena-BJP alliance is yet to finalise seat-sharing arrangements for the upcoming ZPTC and MPTC…
కొన్ని సినిమాలకి ఎంతలా ప్రయత్నించినా కాంట్రవర్సీలు క్రియేట్ అవ్వవు, బజ్ రాదు. కానీ.. కొన్ని సినిమాలకి మాత్రం వద్దన్నా కాంట్రవర్సీలే.…