
[m9adh]
“మన కర్మ ఏంటంటే.. ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడుతున్నా మనం వినాల్సి వస్తోంది. నిజంగా, ఇది మన కర్మే. నాలుగేళ్లు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారితో, బీజేపీతో వాళ్లిద్దరితో కలిసి కాపురం చేశాడు. ఎన్నికలకు ఆరు నెలల ముందు టీడీపీ, బీజేపీల నుంచి ఆయన బయటకొచ్చి తాను పతివ్రతను అని గట్టిగా చెబుతున్నాడు. ఈ ముగ్గురూ కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని పొడిచేశారు. పొడిచిన తర్వాత నాలుగేళ్లు గమ్మున ఉన్నారు. కలిసికట్టుగా సంసారం చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటకొచ్చి ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు.
ఒకరేమో ‘నేను తప్పు చేశాను’ అంటాడు. ఇంకో ఆయనేమో ‘నేను కాదు తప్పు చేసింది… మిగతా ఇద్దరు’ అంటాడు. మరో ఆయనేమో ‘ఆ ఇద్దరూ ఆమోదం తెలిపిన తర్వాతే…’ అని అంటాడు. ఇక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆరు నెలలకోసారి బయటకొస్తాడు. ఓ రోజు ఓ ట్వీట్ ఇస్తాడు. లేదంటే ఓ ఇంటర్వ్యూ ఇస్తాడు..పోతాడు… నాలుగేళ్లుగా మనం చూసింది అంతే. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో మాట్లాడటం మొదలు పెడితే… దానికి మనం సమాధానం చెప్పాలంటే… ఎక్కడున్నాయి విలువలు?. విలువల గురించి ఆయన మాట్లాడతాడు.. నిజంగా తనకు ఎక్కడున్నాయి విలువలు?
నలుగురు… నలుగురు పెళ్లాలు… కొత్త కారును మార్చినట్టుగా పెళ్లాన్ని మారుస్తాడు. నాలుగేళ్లకోసారో ఐదేళ్లకోసారో పెళ్లాన్ని మారుస్తాడు. మీరో, నేనో ఈ పని చేస్తే.. “నిత్యపెళ్లికొడుకు” అని బొక్కలో వేస్తారా? లేదా? ఇది పాలీగామీ కాదా? ఇలాంటి వాళ్లు ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు బయటకొచ్చి… తానేదో సచ్ఛీలుడను అని మాట్లాడతారు. ఇలాంటి వాళ్ల గురించి మనం సీరియస్ గా తీసుకుని, వాళ్ల గురించి విశ్లేషించుకునే పరిస్థితికి రావడమంటే నిజంగా రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు బాధేస్తుంది’ అని జగన్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.
Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…