Telugu

నిత్యపెళ్లికొడుకులా నలుగురు భార్యలను మార్చడం మగతనమా పవన్ కళ్యాణ్?

గత కొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ గట్టిగా విమర్శలు కురిపిస్తున్నారు. నిన్న అనంతపురంలో ఏకంగా జగన్ జైలుకు వెళ్లడం ఖాయం. ఇప్పుడు కేంద్రంతో లాలూచీ చేసుకున్నా పైన ప్రభుత్వం మారితే మళ్ళీ జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు పవన్ కళ్యాణ్. దీనిపై జగన్ గట్టిగా స్పందించారు. రాజాంలో ఒక రోడ్ షోలో జగన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద నిప్పులు చెరిగారు. ఒక సమయంలో ఆయన మీద పర్సనల్ కామెంట్లు కూడా చేశారు.

[m9ad]

ADVERTISEMENT

“ఈ పెద్ద మనిషి ఈ మధ్య కాలంలో మగతనం గురించి మాట్లాడాడు. ఇప్పటికి నలుగురిని పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్లకోసారి భార్యలను మారుస్తారు. పెళ్లి అనే పవిత్రమైన వ్యవస్థను రోడ్డు మీదకు తీసుకొచ్చాడు ఈ పెద్ద మనిషి. నిత్య పెళ్లికొడుకులా నాలుగేళ్ళ కొసరి భార్యలను మార్చడం మగతనమా అని అడుగుతున్నా. ఆయన రెండో భార్య రేణు దేశాయ్ మేము కలిసి ఉండగానే వేరే ఆవిడతో సంసారం చేసి పిల్లాడిని ఇంటికి తీసుకోచ్చాడని మీడియాలో చెప్పారు. అటువంటి ఆడపడచును ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారని వారి అభిమానులు సోషల్ మీడియా లో వేధిస్తుంటే వేడుక చూసాడు ఈ పెద్ద మనిషి,” అన్నారు జగన్.

“ఈయన్ని ఎవరైనా అంటే వారి ఇంట్లోని ఆడవారిపై సోషల్ మీడియాలో దారుణంగా విమర్శిస్తారు. ఒకపక్క ల్యాండ్ పోలింగ్ కు వ్యతిరేకం అంటూ చంద్రబాబు బినామీ లింగమనేని దగ్గర ఆయనని కాపాడటానికి 20 5 కోట్ల భూమిని 20 లక్షలకే తీసుకుని నీతులు చెప్తాడు. ఈయన సినిమా అజ్ఞ్యాతవాసికి ఏ సినిమాకు ఇవ్వని రాయతీలు చంద్రబాబు నాయుడు ఇస్తే ఆయనకు ఏమీ కనపడవు. చంద్రబాబు చేసిన ప్రతీ అన్యాయానికి నాలుగున్నర ఏళ్లగా భాగస్వామిగా ఉండి ఇప్పుడు వ్యతిరేకం అయినట్టు నాటకాలు ఆడుతున్నాడు. దీనికి స్క్రిప్టు డైరెక్షన్ చంద్రబాబు అయితే లింగమనేని నిర్మాత. నేను అవినీతిపరుడని అంటున్నావు. నువ్వు చూసావా నేను అవినీతి చెయ్యడం?,” అని తీవ్ర ఆరోపణలు చేసారు జగన్.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

‘The Third Lion in GPS Will Shock Everyone’

JD Chakravarthy promises a highly entertaining ride with his upcoming film, Gayapadda Simham, where he…

5 minutes ago

Not Just Entry Fee: H-1B Remote Work Sparks $100K Fine?

The $100,000 H-1B visa fee, introduced last year as an entry restriction, is now being…

18 minutes ago