
తాడేపల్లి సిఎం క్యాంప్ కార్యాలయం నుంచి తెనాలి దూరం కేవలం 28 కిమీ మాత్రమే. కనుక కారులో వెళ్ళిరావచ్చు. కానీ హెలికాఫ్టర్లో వెళ్ళిరాబోతున్నారు. ఈ మాత్రం దూరానికి కూడా హెలికాఫ్టర్ వాడుతూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని జనసేన ఆక్షేపించింది.
ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ట్విట్టర్లో, “ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తెనాలి పర్యటన సందర్భంగా జనసేన పార్టీ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం. ముఖ్యమంత్రి వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయాలని ఏ చట్టం చెబుతోంది?అధికారపార్టీ నాయకులకు, అధికారులకు ఎందుకు అంత అభద్రతా భావం?తన ప్యాలెస్ నుంచి తెనాలికి 28 కిమీ. ఈ మాత్రం దూరం కూడా రోడ్డు ప్రయాణం చేయలేరా?తాడేపల్లి ప్యాలెస్ నుంచి తెనాలికి హెలికాప్టర్ లో వెళ్ళడం ఏమిటి?జనం నవ్వుకొంటున్నారు. జనం సొమ్ము జగన్ హెలీకాప్టర్ పర్యటనల పాలవుతోంది. హెలికాప్టర్ డబ్బులతో రోడ్లు బాగవుతాయి. రోడ్డు మీద వెళ్తే గుంతలు.. పాడైపోయిన రోడ్లు ఉంటాయని హెలికాప్టర్లో వెళ్తున్నారా?ప్రజలను మాత్రం గతుకుల రోడ్ల పాలుచేసి తను మాత్రం హాయిగా హెలికాప్టర్లో తిరుగుతున్నారు,”అంటూ విమర్శించారు.
తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాఫ్టర్లో వెళ్ళడంపై ప్రతిపక్షాల విమర్శలని పక్కన పెడితే, ప్రతీనెల ఉద్యోగులు, ఉపాధ్యాయులకి 10-15వ తేదీ వరకు ప్రభుత్వం జీతాలు చెల్లించలేకపోతున్నప్పటికీ, ప్రతీ నెలాఖరున టంచనుగా ఏదో ఓ సంక్షేమ పధకానికి బటన్ నొక్కి వందల కోట్లు విడుదల చేస్తుండటం గమనిస్తే ప్రభుత్వ ప్రాధాన్యత ఏవిదంగా ఉందో అర్దం చేసుకోవచ్చు.
The Narendra Modi government is facing fresh challenges in pushing forward its major reforms. Plans…
Bigg Boss Telugu Season 10 gameplay has reached an entirely new level. Everything was good…