
రాజకీయ ప్రసంగాలలో కాస్త ఆవేశంతో మాట్లాడినపుడు ఒకటి, రెండు తప్పులు దొర్లుతాయి… ఇది చాలా సహజం. దీనిని పట్టుకుని రచ్చ రచ్చ చేయాలనుకుంటే… వారు మాట్లాడినవి కూడా ఉంటాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన వైనంపై వైసీపీ వర్గాలు మళ్ళీ మండిపడ్డాయి. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన సరిగ్గా నాలుగైదు రోజులు గడిచాయో లేదో, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా తమ పార్టీ ప్లీనరీ వేదిక మీద ఓ తప్పుడు ప్రకటన చేసి దొరికిపోయారు.
వైసీపీ రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను పరిచయం చేస్తూ… అతని గురించి చెప్తున్న సమయంలో వ్యాఖ్యానించిన జగన్… 2011 ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీ వెనుక ఉన్నది కూడా ఈయనేనని చెప్పుకొచ్చారు. అయితే సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంవత్సరం 2014 అన్న విషయం తెలిసిందే. సంవత్సరాన్ని తప్పుగా పలికిన జగన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు అవకాశం టిడిపి వర్గీయులకు వచ్చినట్లయ్యింది.
నిజానికి జగన్ చేసిన వ్యాఖ్య వలన ఎలాంటి ప్రయోజనం గానీ, నష్టం గానీ చేకూరదు. కానీ నారా లోకేష్ ద్వారా వైసీపీ సృష్టించిన అనాగరిక వాతావరణం వలన, తెలుగుదేశం పార్టీ వర్గీయులు కూడా ఏ చిన్న అవకాశం లభించినా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో ‘చంద్రబాబు తిట్టమంటూ రోజాకు ఆజ్ఞలు వేసిన వీడియో హల్చల్ చేస్తుండగా, తాజాగా ఈ వీడియో ఒకటి వచ్చి చేరింది. బహుశా అంకెలలో జగన్ వీక్ ఏమో గానీ, గతంలో హెచ్చవేతలను తప్పుగా చెప్పగా, తాజాగా ఏడాది సంఖ్యను తప్పుగా చెప్పుకొచ్చారు.
టైం ఎప్పుడూ ఎవరీ సొంతం కాదని ఈ సందర్భంగా జగన్ కు అర్ధమైందనుకుంటా..!
The Irumudi team had plenty to celebrate as the film’s extraordinary theatrical run continues, with the movie…
ఈ మధ్య రాజకీయాలలో అధికారంలో ఉంటే తప్ప అసెంబ్లీ కి వెళ్ళేది లేదు అనే ఒక వింత సంస్కృతీ మొదలయ్యిందనే…