
అయితే అదే జగన్ సమక్షంలో ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తే ఆంధ్రప్రదేశ్ నుండి భవిష్యత్తులో కూడా ఎటువంటి అభ్యంతరాలు ఉండకుండా ఉంటాయి. అదే సమయంలో తిట్టిన నోటితోనే పొగిడించుకున్నట్టు కూడా అవుతుంది. ఈ ప్రకారం రెండు విధాలుగానూ ఇది కేసీఆర్ కు లాభమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా జగన్ హైదరాబాద్ కాకుండా మరో జిల్లాకు అధికారికంగా వెళ్లడం ఇదే మొదటి సారి అవుతుంది. తెలంగాణలోని రెడ్లు ఆయనకు ఘనస్వాగతం చెప్పడానికి సిద్ధం అవుతున్నారు.
మరోవైపు అసలే వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతం. ఆపై చుట్టూ దట్టమైన అడవి. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొనే కార్యక్రమం అవ్వడంతో పోలీసు శాఖ కనీవినీ ఎరుగని భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగే పరిసరాలను ఇప్పటికే అష్ట దిగ్బంధనం చేసింది. ప్రారంభోత్సవం జరిగే ప్రాంతం చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిని తమ ఆధీనంలోకి తీసుకున్న గ్రేహౌండ్స్ బలగాలు ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. వీరికి అదనంగా ఆక్టోపస్ కమెండోలను, నాలుగు వేల మంది సిబ్బందిని పోలీస్ శాఖ కీలకమైన ప్రాంతాల్లో మోహరించింది.
The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…
Mohanlal is preparing for the release of his upcoming film Drishyam 3 directed by Jeethu…