
ఈ క్రమంలో టీడీపీ నేతలు పోలీసు జీపును చుట్టుముట్టారు. పట్టుబడిన వారు తాము ముఖ్యమంత్రి జగన్ పర్సనల్ డ్రోన్ ఆపరేటర్ల మని జగన్ వద్ద పని చేసే కిరణ్ అనే అతను చెప్పడంతోనే తాము షూట్ చెయ్యడానికి వచ్చాం అని వారు చెప్పిన వీడియోని టీడీపీ విడుదల చేసింది. నిన్న ముఖ్యమంత్రి హాజరైన స్వాతంత్ర దినోత్సవం ఈవెంట్ ని కూడా మేమే షూట్ చేశామని వారు చెప్పారు. అయితే పట్టుబడిన వారిని కాపాడటానికి ఆ తరువాత ప్రభుత్వమే బరిలోకి దిగింది.
డ్రోన్ విజువల్స్ తామే చిత్రీకరించమన్నట్లు ఏపీ జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. వరద పరిస్థితిపై తాజా అంచనా కోసమే విజువల్స్ తీయమన్నట్లు చెబుతున్నారు. అయితే నిబంధలను ప్రకారం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ విజువల్స్ తీయమని అధికారం ఏపీ జలవనరుల శాఖకు కూడా లేదని టీడీపీ నాయకులు అంటున్నారు. ఇది ఇలా ఉండగా చంద్రబాబు జిల్లా ఎస్పీ, డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో ఫోన్లో మాట్లాడారు. హైసెక్యూరిటీ జోన్‌లో డ్రోన్లు ఎగరడంపై అధికారులను నిలదీశారు.
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…
The Tamil film industry must be very proud about the fact that one of their…