
దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు మాత్రం బయటకు రాలేదు. అలాగే ఆ ఘటన జరిగినప్పుడు నగరంలో పనిచేసిన, తాజాగా విశాఖ రేంజ్ పరిధిలో పనిచేస్తున్న మరికొంతమంది అధికారులను కూడా వీఆర్‌కు పంపినట్లు సమాచారం. దీనితో వారిపై జగన్ కోపం చల్లారినట్టు అయ్యింది అని వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే ఎవరు అధికారంలో ఉన్న ప్రభుత్వ ఆదేశాలను అమలు చెయ్యడం తమ విధి అని దానిని విరోధంగా చూడటం దారుణమని పోలీసులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో 2017 జనవరి 26న విశాఖ బీచ్‌రోడ్డులో వైఎస్సార్ కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొంటానని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ప్రకటించారు. గణతంత్ర వేడుకల రోజున బీచ్‌రోడ్డులో నిరసన కార్యక్రమం నిర్వహిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన నగర పోలీసులు విశాఖ రావద్దని ఆయన్ను కోరారు. అదే సమయంలో విశాఖలో పెట్టుబడుల సదస్సు కూడా జరుగుతుండడంతో జగన్ ను విమానాశ్రయంలోనే ఆపేశారు.
Indian travellers flying through Europe have received major relief after France removed a visa rule…
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…