
అయితే రాజకీయంగా ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యే కావడంతో బాలకృష్ణపై బహిరంగంగా అంత ప్రేమ కురిపించలేని పరిస్థితి నెలకొందని, జగన్ అనుయాయులు చెప్తుంటారు. అందుకే ప్రత్యర్ధి పార్టీలో ఉన్నా, ఇప్పటివరకు బాలకృష్ణపై ఒక్క విమర్శ కూడా చేయలేదని చెప్తుంటారు. అయితే విమర్శల మాట పక్కన పెడితే, తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణపై వైసీపీ అధినేత జగన్ ప్రశంసల జల్లు కురిపించినట్లుగా తెలుస్తోంది.
“బాలకృష్ణ చాలా మంచోడు, ఎవరినీ తిట్టరు, ఎవరినీ విమర్శించరని” జగన్ కితాబిచ్చినట్లుగా టిడిపి ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఈ రోజు అసెంబ్లీలో సరదాగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు విన్న టిడిపి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్… ‘జగన్ కామెంట్స్ నిజమేనా?’ అంటూ ఆశ్చర్యచకితులయ్యారు. దీనికి బాబురావు నిజమేనని, అతంలో బాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడిగా కూడా జగన్ పనిచేశారని చెప్పడంతో అక్కడున్న వారంతా ఫక్కున నవ్వేసారు.
మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…
The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana cabinet by…