
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బంది ఎవరినీ తిరిగి అదే పోస్టుల్లో లేదా వేరే కీలక బాధ్యతల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవద్దని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అప్పటి మంత్రుల కార్యాలయాల్లో ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీ, ప్రైవేట్ కార్యదర్శులు, అదనపు ప్రైవేట్ కార్యదర్శులు, వ్యక్తిగత సహాయకులుగా పలువురు పనిచేశారు. ఇక వారందరికీ మళ్ళీ క్యాబినెట్ మంత్రుల వద్ద పని చేసే అవకాశం ఇవ్వరాదని తేల్చి చెప్పేశారు.
కొత్త నియామకాలు జగన్ ఓకే అన్నాకే జరుగుతున్నాయి. అయితే ఈ విషయంలో పని ముందుకు సాగడం లేదంట. మెజారిటీ మంత్రులు కొత్త వారు కావడం పాత వారికి కూడా శాఖలు కొత్త కావడంతో అధికారులు లేక పని ముందుకు సాగడం లేదట. పైగా ఒక సామాజిక వర్గం వారి కోసమే చూస్తుండడంతో ఆ మేరకు కొరత కూడా ఉందట. అసలే రెండున్నర ఏళ్లకు 90% మంత్రులను మారుస్తామని చెప్పేశారు జగన్ అందులో ఒక నెల ఇలాగే పోయిందని మంత్రులు బాధ పడుతున్నారు.
Hai Jawani Toh Ishq Hona Hai, starring Varun Dhawan, Pooja Hegde, and Mrunal Thakur, has…
CM Vijay is proving that "elevation" isn’t just about winning elections; it’s about how you…