
ఇది ఇలా ఉండగా జగన్ పోలవరం పర్యటనపై సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రేపు తెలంగాణాలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా వెళ్లనున్నారు జగన్. అయితే చివరి నిముషంలో సొంత రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టును సందర్శించకుండా పొరుగురాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్తే విమర్శలు వస్తాయని కొందరు నాయకులు చెప్పడంతో ఉన్నఫళంగా పోలవరం సందర్శనకు బయల్దేరారు జగన్.
పోలవరం ప్రాజెక్టుపై ఇంకా రూ.34,751.06 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఒక్క పునరావాసంపైనే రూ.27,025.65 కోట్లు ఖర్చు చేయాలి. కేంద్రం నుంచి పెండింగ్‌లో ఉన్న నిధులు కలిపి ఈ ప్రాజెక్టుకు ప్రస్తుత లెక్కల ప్రకారం రూ.39,561.10 కోట్లు రావాలి. రాష్ట్రం ఈ డబ్బు పెట్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు నడిపించే పరిస్థితి లేదు. దీనితో కేంద్రప్రభుత్వం సాయం ఎంతో కీలకం. ఈ నిధులను రాబట్టే క్రమంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్ర పెద్దలను ముఖ్యమంత్రి జగన్ త్వరలో కలిసే అవకాశముందని సమాచారం.
Hai Jawani Toh Ishq Hona Hai, starring Varun Dhawan, Pooja Hegde, and Mrunal Thakur, has…
CM Vijay is proving that "elevation" isn’t just about winning elections; it’s about how you…