
సంఖ్యాపరంగా భారత దేశం 19వ స్థానంలో నిలుస్తుంది. మొత్తం 714 మంది భారతీయుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ పాత్రల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పేరు కూడా ఉంది. సరిగ్గా జగన్ పాదయాత్ర మొదలు పెట్టే ఒక రోజు ముందు ఈ అంతర్జాతీయ స్కామ్ లో జగన్ పేరు రావడం ఆ పార్టీ ని ఇబ్బంది పెట్టే విషయమే.
ఇప్పటికే అనేక కేసులలో ఇరుక్కుని సతమతం అవుతున్న జగన్ మోహన్ రెడ్డి ఈ విషయం ఇబ్బంది పెట్టేదే. మరోవైపు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం ఇడుపులపాయ చేరుకున్న జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు.
అనంతరం సుమారు 9 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాత్రికి వేంపల్లి చేరుకుని అక్కడే బస చేస్తారు. అయితే ఆ పార్టీ లీడర్లు అంతా ఇప్పుడు ప్యారడైజ్ పేపర్స్ ను ఎదురుకునే పనిలో పడతారు. ఆ లోగా శుక్రవారం రానే వస్తుంది మళ్ళి జగన్ హైదరాబాద్ కోర్ట్ కు వెళ్ళాలి , మళ్ళి దాని గురించి ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తారు. చూడబోతే జగన్ కు గడ్డు కాలంలనే ఉంది.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…