
జననాయకుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సొంత ఛానల్ లో సొంత మనిషైన కొమ్మినేని శ్రీనివాస రావు తోనే ఇంటర్వ్యూ జరిపించారు. ఆ ఇంటర్వ్యూ కు సంభందించిన ప్రోమో చూస్తే ఆ ఇంటర్వ్యూ ఎలా సాగిందో ఇట్టే చెప్పేయొచ్చు. అడుగడుగునా ప్రజా మద్దత్తుతో ముందుకుసాగుతున్న పాదయాత్రలో వైఎస్ జగన్ అనుభవాలేమిటి?
పాదయాత్రపై చంద్రబాబు, టీడీపీ చేస్తున్న కామెంట్స్‌కు ఆయన ప్రతిస్పందన ఏమిటి? అధికార ప్రలోభాల పర్వం శృతిమించిన నేపథ్యంలో వైకాపా నుంచి టీడీపీలోకి కొనసాగుతున్న వలసలపై జననేత ఏమంటున్నారు? కేసుల నుంచి బయటపడేందుకో.. మరోదానికో అంటూ కొందరు చేస్తున్న వెకిలి వాదనపై వైఎస్ జగన్ ఏం చెప్తున్నారు? లాంటి ప్రశ్నలు వేసి జగన్ నుండి ఆయన రోజు చేసే రొటీన్ ఆరోపణలనే సమాధానాలుగా చూపించారని తెలుస్తుంది.
ప్రోమోలో సైతం ఒక్క ఆసక్తికర ప్రశ్న లేకపోవడం నిరాశ పరిచేదే. ఇది దాదాపుగా జగన్ తనకు తాను ఇంటర్వ్యూ చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అయితే ఇలాంటి సొంత డబ్బా జాస్తి ప్రయోజనం నాస్తి ఇంటర్వ్యూల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని సొంత పార్టీ వల్లే పెదవి విరుస్తున్నారు. సాక్షిని ధాటి బయటకు వచ్చిన రోజే జగన్ కు మంచి జరుగుతుందని వారి అభిప్రాయం.
సినిమా రిలీజ్‌కు ముందు నిర్మాత నాగవంశీ పేరు ట్విట్టర్‌లో తెగ తిరుగుతోంది. సినిమా గురించి కాదు. ఆయన వ్యక్తిగత జీవితంపై…
While Sanjay Leela Bhansali is busy completing Love & War, he has been equally working…