
అందులో గతంలో టీటీడీ బోర్డు మెంబెర్ గా పని చేసి తీసివేయ్యబడ్డ శేఖర్ రెడ్డి కూడా ఉండటం విశేషం. 2016లో డిసెంబరు 8న ఆయన వ్యాపారసంస్థలు, ఇంట్లో ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించి రూ.33.89 కోట్ల కొత్త 2వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేయడంతో డిసెంబరు 11న తితిదే పాలకమండలి నుంచి శేఖర్‌రెడ్డిని తొలగించారు.
అప్పట్లో శేఖర్ రెడ్డి పేరుతో అప్పటి ప్రధానప్రతిపక్షం, ఇప్పటి అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్, అప్పటి టీడీపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేసింది. శేఖర్ రెడ్డి లోకేష్ బినామీ అని, 100 కోట్లు ఇచ్చి టీటీడీ బోర్డు మెంబెర్ పదవి కొనుకున్నాడని చాలా విమర్శలు చేసింది. స్వయంగా జగన్ కూడా అనేక విమర్శలు చేశారు.
అయితే అప్పట్లో అతనికి కొత్త నోట్లు ఎలా వచ్చాయి అనేది ఆదాయపన్నుశాఖ రుజువు చెయ్యలేక ఆ కేసులను ఆటక్కెకించింది. ఇప్పుడు అతనికి క్లీన్ చిట్ వచ్చింది అనే పేరుతో జగన్ ప్రభుత్వం తిరిగి టీటీడీ బోర్డులోకి తీసుకున్నారు. ఇది పెద్ద సంచలనం అనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ప్రభుత్వం కొంత అతి తెలివి ప్రదర్శించే ప్రయత్నం చేసింది.
శేఖర్ రెడ్డి అంటే తెలిసిపోతుంది గనుక ఇచ్చిన జీ.ఓలో అతని పేరు శేఖర్ ఏజే గా మార్చింది. ఈ మార్పుతో మీడియా, సోషల్ మీడియా కళ్ళు కప్పవచ్చని ప్రభుత్వం ఎలా అనుకుందో అర్ధం కాలేదు. ఆ విషయం బయటకు పొక్కడం, విమర్శలు రావడం జరిగిపోయాయి. ఇప్పుడు అధికార పార్టీ ఏమని సమర్ధించుకుంటుందో.
Indian travellers flying through Europe have received major relief after France removed a visa rule…
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…