
అయితే జగన్ వారికి అప్పాయింట్మెంట్ ఇవ్వలేదు. చివరి వరకూ ప్రయత్నించి వారు వెనుదిరిగారు. చంద్రబాబు జగన్ కు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. ప్రమాణస్వీకారం సందర్భంగా వ్యాఖ్యాతలు, చివరికి ముస్లిం మత పెద్దలు కూడా చంద్రబాబును విమర్శించడం గమనార్హం. ప్రమాణస్వీకారం అనంతరం తన ప్రసంగంలో కూడా జగన్ తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీనితో ఈ కార్యక్రమానికి వెళ్లకపోవడమే మంచిది అయ్యిందని టీడీపీ వారు అంటున్నారు.
మరోవైపు జగన్ ప్రమాణస్వీకారం అనంతరం చేసిన తన మొదటి ప్రసంగం తరువాత తన తల్లి విజయలక్ష్మిని కౌగిలించుకున్నారు. భావోద్వేగంతో ఆమె కంటతడిపెట్టేశారు. అనంతరం ఆమె కన్నీరు తుడిచిన జగన్ స్టేజ్‌పై నుంచి కిందికి తీసుకెళ్లారు. సభికులు, కార్యకర్తలు, అభిమానులు, అతిథులకు అభివాదం చేస్తూ జగన్.. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి నేరుగా తాడేపల్లిలోని తన స్వగృహానికి చేరుకున్నారు. కాసేపట్లో సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం కోసం ఢిల్లీ వెళ్లనున్నారు.
Kiara Advani has once again become a major topic of discussion on social media. While…
Aarti Chikara is redefining summer glamour with her latest poolside revelation. Draped in a vibrant…