Telugu

పవన్ కళ్యాణ్ తో దోస్తీకి జగన్ రాయబారం జరిపారా?

ట్విట్టర్ లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి, జనసేన కీలక నేత నాగబాబు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ప్రధాన ఎన్నికల అధికారి మార్పు పై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ….కరోనా ఆపత్కాలంలో రాజకీయాలు చేయకుండా జనసేన స్వీయ నియంత్రణ అన్నారు. దీనితో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు ఎక్కుపెట్టారు… విజయ సాయి రెడ్డి.

“కరోనా ఆపత్కాలంలో రాజకీయాలు చేయకుండా జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోందట. రాజకీయాలు చేయడానికి నీకు గ్రౌండే లేదు కదా పవన్. ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని ‘నేను లేస్తే మనిషిని కాదు’ అని చిటికెలేసినట్టుగా ఉంది నీ వాలకం. ప్రజా తీర్పును అప్పుడే మర్చిపోతే ఎలా?,” అని విజయసాయి రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

ADVERTISEMENT

అయితే దీనిని సామాన్యంగా వదిలిపెట్టలేదు మెగా బ్రదర్ నాగబాబు. “నువ్వు చెప్పింది కరెక్టే. ఈ ఎదవ రాజకీయాలు చేయటానికి నీ లాంటి గుంటనక్కలున్న సంగతి మాకు తెలుసు విజయ సాయి రెడ్డి..మరి మన ఇద్దరి కామన్ స్నేహితుడి ద్వారా నా ఇంటికి వచ్చి పవన్ తో దోస్తీ కి రెడి అన్న మీ గుంట నక్కరాజకీయలు నాకు గుర్తున్నాయి,” అంటూ ఘాటుగా స్పందించారు.

ఎన్నికల సమయంలో జగన్, పవన్ కళ్యాణ్ ఒకరి మీద ఒకరి తీవ్ర విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. జగన్ అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద కూడా వ్యాఖ్యలు చేసారు. అయితే దీనిబట్టి వారి మధ్య పొత్తు చర్చలు కూడా జరిగి విఫలం అయ్యాయని అర్ధం అవుతుంది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Can Vijay and Udhayanidhi Become the Next CBN-YSR?

The Tamil Nadu Assembly is about to witness a historic "face-off" that feels more like…

9 minutes ago

Anil Ravipudi’s Clever Strategy Before Audience Gets Bored

One interesting pattern in Anil Ravipudi’s career is becoming hard to ignore. He rarely sticks…

29 minutes ago