Telugu

ప్రత్యేక హోదా అనే అంశానికి ఇది గడ్డు కాలమే

ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ సంచలనమైన విజయం నమోదు చేసింది. 175 ఎమ్మెల్యే సీట్లలో 151 సీట్లలో, 25 ఎంపీ సీట్లలో 22 కైవసం చేసుకుని సంచలన నమోదు చేసుకుంది. 22 ఎంపీ సీట్లతో బీజేపీ, కాంగ్రెస్ తరువాత పార్లమెంట్ లో మూడవ అతిపెద్ద పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ అవతరించింది. నిన్న ఒక టీవీ ఛానల్ తో జగన్ మాట్లాడుతూ ఈరోజు నరేంద్ర మోడీకి వచ్చిన అఖండ మెజారిటీ కారణంగా ప్రత్యేక హోదా అంత తేలిక కాదని, అయినా తమ వైపు నుండి ఒత్తిడి ఉంటుందని చెప్పుకొచ్చారు,

కొత్తగా ఎన్నికైన ఎంపీలతో మాట్లాడుతూ… అవసరమైతే రాజీనామాలకు అయినా సిద్ధం కావాలని చెప్పినట్టు కొన్ని పేపర్లు రాశాయి. మొదటి సమావేశంలోనే రాజీనామాలు అనడంతో వారు విస్తు పోయారట. అయితే ఇప్పటి పరిస్థితులలో రాజీనామాల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుందో అర్ధం కాని పరిస్థితి. బీజేపీకి రాష్ట్రంలో ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. దేశం మొత్తం జయించిన నరేంద్ర మోడీకి ఇప్పుడు రాష్ట్రంలో వచ్చేదీ పోయేదీ ఏమీ లేదు. జగన్ తన ఎంపీలతో రాజీనామా చేయించినా బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేదు.

ADVERTISEMENT

అదే విధంగా బీజేపీ ఇప్పుడు లోక్ సభలోనూ, రాజ్యసభలోనూ తిరుగులేని మెజారిటీ ఉంది. పార్లమెంట్ లో తమ అవసరాల కోసం ఏ పార్టీ వైపు చూసే అవసరం లేదు. ఏ రకంగా చూసుకున్నా ప్రత్యేక హోదా అనే అంశానికి ఇది గడ్డు కాలమే. అప్పుడు చంద్రబాబు ఎటువంటి సంకటస్థితిలో ఉన్నారో ఇప్పుడు జగన్ కూడా ఈ విషయంలో అదే స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది రెండేళ్ల కాలంలో పార్లమెంట్ లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Baththa OTT Release: Will Audience Regret Once Again?

Vijay Sethupathi's Baththa directed by Balaji Tharaneetharan and produced by Atlee, was released in theatres…

8 minutes ago

Pics: Miloni Makes Soft Glam Look Fierce Again!

Miloni Jhonsa walks into these frames like she knows the camera is hooked. Draped in…

38 minutes ago