
జగన్‌తోపాటు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా సమన్లు జారీచేసింది. మార్చి 16న నిందితులు, కంపెనీల ప్రతినిధులు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. దీనితో వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు పెద్ద ఆయుధం దొరికినట్టు అయ్యింది. కేంద్రంపై పోరాటం చేస్తునందుకే తమను ఇబ్బంది పెట్టె ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పుకునే అవకాశం దొరికింది.
ఇక కేసు వివరాల్లోకి వెళ్తే… ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలోని ఇందూటెక్‌కు అర్హత లేకపోయినా రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం మామిడిపల్లిలో 250 ఎకరాలను అప్పటి వై.ఎస్.ప్రభుత్వం కట్టబెట్టింది. సెజ్ పేరుతో పొందిన 250 ఎకరాల్లో మరో 100 ఎకరాలను శ్యాంప్రసాద్‌రెడ్డి కుమారుడు దయాకర్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న ఎస్పీఆర్ ప్రాపర్టీస్‌కు అప్పగించేశారు.
ఇందూటెక్ సెజ్‌కు అనుమతినిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే శ్యాంప్రసాద్‌రెడ్డి సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు. లబ్ధికి ప్రతిఫలంగా శ్యాంప్రసాద్‌రెడ్డి రూ.70 కోట్లను జగన్ కంపెనీల్లోకి పెట్టుబడిగా ముడుపులు చెల్లించారు. జగన్‌కు చెందిన జగతిలో రూ.50 కోట్లు, కార్మెల్ ఏసియా హోల్డింగ్స్‌లో రూ.20 కోట్లు పెట్టుబడులు పెట్టారు.
For the past few years, Suriya and Jyothika’s Mumbai connection has been a talking point…
Prithviraj Sukumaran has revealed an interesting reason behind his decision to do Meghna Gulzar's crime…