
తాజాగా జగన్ కు సంబంధించిన ఓ అంశాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియా సెటైర్లు వేస్తున్నారు. గతంలో ఓ జాతీయ ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూను ఇచ్చిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, “ఈ మాటను మార్క్ చేసుకోండి… మార్క్ చేసుకోండి… ఒక మాట సమాజానికి ఇస్తున్నాము… తాము ఎట్టి పరిస్థితులలో బిజెపితో కలిసే అవకాశం లేదని, ఎన్నికల ముందు గానీ, తర్వాత గానీ” అంటూ కుండబద్దలు కొట్టిన విధంగా చెప్పుకొచ్చారు. అయితే అదే అంశంపై ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో జగన్ పూర్తి విరుద్ధంగా చెప్పడంతో అది కాస్త వైరల్ అయ్యింది.
బిజెపికి సంబంధించిన తాము ఎప్పుడూ ఒకే విధంగా ఉన్నామని… తాము ఎప్పుడూ వారికి తోడ్పాటుగా ఉన్నామని… మరింత స్పష్టంగా చెప్పుకొచ్చారు. జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత బిజెపిపై వైఖరి పూర్తిగా మారిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో అడగకపోయినా… సహకారం అందించిన జగన్, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో మరోసారి జగన్ అంశం తెరపైకి రావడంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది. మరి మీరూ ఓ లుక్కేయండి..!
Romanchakam is getting a special kind of attention ahead of its release tomorrow, thanks to…
Ravi Teja’s Irumudi has become the sensational blockbuster of the year, with the film now…