
కానీ ప్రస్తుతం జనసేన టార్గెట్ కూడా అధికారమే కావడంతో, జగన్ కు అడ్డుగా పవన్ తగలవచ్చు. ఎప్పుడైతే అధికారమే లక్ష్యమని పవన్ స్పష్టం చేసారో, ఆ సమయం నుండి సోషల్ మీడియాలో జగన్ వర్గీయులు పవన్ కు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. ముఖ్యంగా ఆదివారం నాడు జరిపిన బహిరంగ సభకు హాజరయ్యే ముందు నడుచుకుంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న వారికి జరగాల్సిందిగా తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. మీడియాలో కూడా ఇది స్పష్టంగా రికార్డైంది.
దీంతో పవన్ కళ్యాణ్ కేవలం రీల్ హీరో మాత్రమేనని, అసలైన రియల్ హీరో జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని, మరో పక్కన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తున్న జగన్ మోహన్ రెడ్డి వీడియోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. దీంతో మొన్నటివరకు తమకే అనుకూలం అనుకున్న జనసేన, తమ రూట్ లోకే కావడం జగన్ కు జలక్ ఇచ్చినట్లయ్యింది. రాజకీయాలు ఎప్పుడు ఏ రూపు సంతరించుకుంటాయో చెప్పలేని పరిస్థితులలో పొలిటిక్స్ జరుగుతున్నాయి.
Tension in Bigg Boss Telugu Season 10 is rising after the dramatic double elimination of…
Five friends set out to turn a business idea into a successful venture, but their…