
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం గురించి ప్రకటన చేస్తారని ఊహాగానాలు వినిపించినప్పటికీ అటువంటిదేమీ చేయకలేదు. కానీ వైఎస్ జయంతి పురస్కరించుకొని రాహుల్ గాంధీ నివాళులు ఆర్పిస్తూ ట్వీట్ చేయగా, “రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తన తండ్రి భావించేవారని, ఆయనని గుర్తుంచుకొని గౌరవిస్తున్నందుకు కృతజ్ఞతలు,” అంటూ వైఎస్ షర్మిల వెంటనే జవాబు ఇచ్చారు.
రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సమర్దిస్తూ ట్వీట్ చేయడం ద్వారా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సరైన సందేశమే ఇచ్చిన్నట్లు భావించవచ్చు. అయితే ఆమె తెలంగాణ కాంగ్రెస్లో చేరాలనుకొంటుంటే, ఆమెను ఏపీ కాంగ్రెస్లో చేరాలని సూచిస్తుండటం వలన, కాంగ్రెస్లో చేరిక ఆలస్యమవుతున్నట్లు భావించవచ్చు. అయితే కాంగ్రెస్లో చేరడం ఖాయమే కనుక నేడో రేపో అధికారిక ప్రకటన చేయవచ్చు. ఆదివారం ఆమె ఖమ్మం జిల్లా పాలేరులో బహిరంగసభ నిర్వహించబోతున్నట్లు సమాచారం. కనుక ఆ సభలో ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించి, తాను పనిచేసేది ఏపీలోనా లేక తెలంగాణలోనేనా? అనే విషయంపై స్పష్టత ఈయవచ్చు.
Kiran Abbavaram, who has acted in several successful films, is making his directorial debut with…
Nagarjuna has decided to present the film Itllu Arjuna under his Annapurna Studios banner after…